News March 18, 2025
రేపు బాపట్ల జిల్లాలో పర్యటించనున్న వైఎస్ జగన్

వైసీపీఅధ్యక్షుడు, మాజీ సీఎం జగన్ బుధవారం బాపట్ల జిల్లా మేదరమెట్లలో పర్యటించనున్నారు. ఉదయం 9.30కు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి మేదరమెట్ల చేరుకుంటారు. అక్కడ వైసీపీ పార్లమెంటరీ పార్టీనేత వైవీ సుబ్బారెడ్డి నివాసానికి చేరుకుని, ఆయన మాతృమూర్తి యర్రం పిచ్చమ్మ (85) పార్దివ దేహానికి నివాళులర్పిస్తారు. వైవీ కుటుంబ సభ్యులను పరామర్శించిన అక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్నం 12 గంటలకు తాడేపల్లి చేరుకుంటారు.
Similar News
News March 18, 2025
ఒక్క హామీ నెరవేర్చితే బాధ్యత తీరిపోయినట్టు కాదు: మంత్రి లోకేశ్

ఒక హామీ నెరవేర్చితేనే నా బాధ్యత తీరిపోయినట్టు కాదని మంత్రి నారా లోకేశ్ అన్నారు. మంగళవారం చేనేతలకు ఇచ్చిన ఉచిత విద్యుత్ హామీని నిలబెట్టుకున్న సందర్భంగా మంత్రి ఒక ప్రకటన విడుదల చేశారు. ఇచ్చిన హామీ లక్షలాదిమంది ప్రజలను ఆర్థికంగా నిలబెట్టేందుకు ఎంతో దోహదపడుతుందని అందులోనే తనకు సంతోషం ఉందని పేర్కొన్నారు. చేనేత వస్త్రాలకు విస్తృత మార్కెటింగ్ కల్పించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తానన్నారు.
News March 18, 2025
తెనాలిలో ఎన్నారై కుటుంబంలో విషాదం

అమెరికా నార్త్ కరోలినాలో తెనాలికి చెందిన ఎన్నారై కుటుంబంలో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. తెనాలి అయితానగర్‌కు చెందిన గడ్డం థామస్ కుమార్తె షారోన్ సధానియేల్‌కు, అమెరికాకు చెందిన సథానియేల్ లివిస్కాతో 2007లో వివాహం కాగా అమెరికాలో ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. తుఫాను కారణంగా భారీ వృక్షం కూలి వీరి ఇంటిపై పడటంతో ఇంట్లో నిద్రిస్తున్న కుమారులు మృతి చెందారు.
News March 18, 2025
గుంటూరు జిల్లా TODAY TOP NEWS

* గుంటూరులో 10వ తరగతి పరీక్ష కేంద్రం వద్ద ఆందోళన
* డ్రగ్స్ గంజాయిపై ఉక్కు పాదం మోపుతాం: మంత్రి లోకేశ్
* గుంటూరులో డ్వాక్రా గ్రూప్ ప్రెసిడెంట్ మోసం
* వాలంటీర్ల రెగ్యులరైజ్‌పై మంత్రి క్లారిటీ
* మాజీ ఎమ్మెల్యే కుమారుడి వివాహానికి మాజీ సీఎం జగన్
* తల్లిదండ్రుల పట్ల దురుసుగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు
* అప్పుల బాధతో కౌలు రైతు ఆత్మహత్య
* మంగళగిరిలో గంజాయి ముఠా అరెస్ట్