News April 14, 2025

రేపు బావోజీ జాతరకు రానున్న ఎమ్మెల్సీ, మాజీ మంత్రి

image

కొడంగల్ నియోజకవర్గంలోని భూనీడ్‌లో సోమవారం జరిగే అంబేడ్కర్ జయంతి ఉత్సవాల్లో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి పాల్గొంటారని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి తెలిపారు. అనంతరం తిమ్మిరెడ్డిపల్లిలో జరిగే సద్గురు సంత్ గురులోకమసంద్ మహరాజ్ బావోజీ జాతర బ్రహ్మోత్సవంలో పాల్గొంటారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ నాయకులు రావాలని కోరారు.

Similar News

News April 15, 2025

BREAKING.. నాగర్‌కర్నూల్ జిల్లాలో దారుణ హత్య

image

నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలంలో ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేసిన ఘటన మంగళవారం జరిగింది. స్థానికుల వివరాలు.. నడింపల్లి గ్రామానికి చెందిన వీరయ్యను గ్రామ శివారులోని HYD-అచ్చంపేట రోడ్డుపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు గొడ్డలితో నరికి హత్య చేశారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరకుని విచారిస్తున్నారు.

News April 15, 2025

MBNR: భార్య వదిలిపెట్టిందని ఆత్మహత్య

image

భార్య వదిలిపెట్టి వెళ్లిపోయిందని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన నిన్న నవాబుపేటలో జరిగింది. పోలీసుల వివరాలు.. మూడేళ్ల క్రితం శంషాబాద్‌లో ఐషా అనే యువతిని నవాబుపేటకు చెందిన తాజ్(30) ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరి మధ్య కొన్ని రోజులుగా మనస్పర్థలు రావటంతో ఐషా భర్తని వదిలి వెళ్లిపోయింది. దీంతో మనస్తాపానికి గురైన తాజ్ ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మేరకు కేసు నమోదైంది.

News April 15, 2025

మహబూబ్ నగర్ జిల్లాలో.. ఒకే రోజు ఐదుగురి మృతి

image

MBNR జిల్లాలో ఒకేరోజు వేర్వేరు ఘటనల్లో సోమవారం ఐదు మంది మృతి చెందటం జరిగింది. జిల్లా కేంద్రం సమీపంలో దివిటిపల్లి వద్ద క్వారీ గుంతలో పడి విజయ్, సుశాంత్, మహమ్మద్ మృతి చెందగా.. బాలానగర్ మండలంలోని గంగాధర్‌పల్లిలో చేపలు పేటకు వెళ్లి రాములును కాపాడబోయి యాదయ్య కూడా గల్లంతయ్యాడు. ఈ రెండు ఘటనలతో మహబూబ్ నగర్ జిల్లాలో సోమవారం తీవ్ర విషాదం నెలకొంది. చనిపోయిన ఐదుగురు నిరుపేద కుటుంబాలు కావడం విశేషం.

error: Content is protected !!