News March 28, 2025

రేపు భద్రకాళి ఆలయంలో ఒడిశాల బియ్యం వేలం

image

ఓరుగల్లు ఇలవేల్పు, తెలంగాణ ఇంద్రకీలాద్రి శ్రీ భద్రకాళి ఆలయంలో భక్తులు అమ్మవారికి సమర్పించిన 20 క్వింటాళ్ల ఒడిశాల బియ్యాన్ని ఈ నెల 29న ఉదయం 11 గంటలకు బహిరంగ వేలం ద్వారా విక్రయించనున్నట్లు ఈఓ శేషుభారతి తెలిపారు. వేలంలో పాల్గొనాలనుకునే వారు రూ.5 వేలు ధరావత్ సొమ్ము డీడీ రూపంలో చెల్లించి పాల్గొనాలని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం భద్రకాళి దేవస్థాన కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.

Similar News

News November 15, 2025

అతి వేగం ప్రమాదకరం: వరంగల్ ట్రాఫిక్ పోలీస్

image

థ్రిల్‌ కోసం వేగం పెంచి ప్రమాదాలను కొని తెచ్చుకోవద్దని వరంగల్ ట్రాఫిక్ పోలీసులు వాహనదారులకు సూచించారు. రోడ్లు ఖాళీగా ఉన్నాయని స్పీడ్‌గా వెళ్లి ప్రమాదాలను స్వాగతించవద్దని వారు కోరారు. తమ నిర్లక్ష్యపు డ్రైవింగ్‌తో ఇతరులను ఇబ్బంది పెట్టొద్దని, కుటుంబ సభ్యుల కోసమైనా సురక్షితంగా గమ్యం చేరుకోవాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

News November 15, 2025

NLG: జీతాల అందక 8 నెలలు

image

నల్గొండ జిల్లాలో పశుసంవర్ధక శాఖ పరిధిలో పనిచేస్తున్న గోపాల మిత్రలకు సకాలంలో వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత 8 నెలలుగా తమకు వేతనాలు సకాలంలో ఇవ్వకపోవడంతో అప్పులు చేసి ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉందని తెలిపారు. జిల్లాలో సుమారు 100 మందికి పైగానే గోపాలమిత్రలు పనిచేస్తున్నారు. ఎన్నో సంవత్సరాలుగా చాలీచాలని వేతనాలతో విధులు నిర్వహిస్తున్నట్లు వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

News November 15, 2025

GNT: నేడు ఘట్టమనేని శివరామకృష్ణ వర్ధంతి

image

గుంటూరు (D) బుర్రిపాలెం గ్రామంలో 1943 మే 31న, ఘట్టమనేని శివరామకృష్ణ జన్మించారు.1965 తేనె మనసులు సినిమాతో ఆయన తెలుగు సినీ రంగంలో అడుగుపెట్టారు. తేనె మనసులు హిట్ అవడంతో, అప్పటి అగ్ర హీరోలతో పోటీపడి సూపర్ స్టార్‌గా ఎదిగారు. గూఢచారి 116, మోసగాళ్లకు మోసగాడు, అల్లూరి సీతారామరాజు, సింహాసనం, ఇలా ఎన్నో హిట్ సినిమాలతో 350పై చిలుకు సినిమాలు చేసి అగ్ర హీరోల సరసన నిలిచారు. 15 నవంబర్ 2022న తుది శ్వాస విడిచారు.