News March 25, 2025

రేపు భైంసాలో ఎస్పీ ఫిర్యాదుల విభాగం

image

పోలీసులు మీకోసంలో భాగంగా బుధవారం భైంసా క్యాంపు కార్యాలయంలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు ఫిర్యాదుల విభాగం నిర్వహించనున్నట్లు ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. భైంసా సబ్ డివిజన్లో ఉన్న ఫిర్యాదుదారులు నేరుగా ఆమెను కలిసి ఫిర్యాదులు అందజేయవచన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.

Similar News

News March 28, 2025

ఏపీలో బర్డ్‌ఫ్లూతో 6 లక్షల కోళ్లు మృతి: అంతర్జాతీయ సంస్థ

image

APలోని 8 ప్రాంతాల్లో బర్డ్‌ఫ్లూ విజృంభించినట్లు పారిస్‌కు చెందిన వరల్డ్ ఆర్గనైజేషన్ ఫర్ యానిమల్ హెల్త్ వెల్లడించింది. కోళ్ల ఫామ్స్‌తో పాటు ఇంట్లో పెంచుకునే కోళ్లకూ ఇది సోకిందని తెలిపింది. రాష్ట్ర తూర్పు ప్రాంతాల్లో H5N1 ఎక్కువగా విస్తరించినట్లు పేర్కొంది. దీనివల్ల 6,02,000 కోళ్లు చనిపోయినట్లు వివరించింది. కాగా ఇటీవల ఉ.గోదావరి, కృష్ణా, NTR జిల్లాల్లో బర్డ్‌ఫ్లూ కేసులు నమోదైన విషయం తెలిసిందే.

News March 28, 2025

నారాయణపేట: ‘250 గజాల ప్లాట్‌కు రూ.45 లక్షల LRS’

image

ప్లాట్లను రెగ్యులరైజేషన్ చేసుకోవడానికి ప్రభుత్వం LRS విధానాన్ని ప్రవేశపెట్టింది. గతంలో రూ.1,000 కట్టి LRSకు దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులు బాబోయ్ ఇదేం LRS అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. నారాయణపేట జిల్లా మరికల్ పట్టణంలో 250 గజాల భూమికి రూ.45 లక్షలు LRS రావడంతో ప్లాటు అమ్మినా అంత డబ్బు రాదని, ప్రభుత్వం పేదల కడుపు కొట్టేందుకే LRSను ప్రవేశపెట్టిందని బాధితులు మండిపడుతున్నారు.

News March 28, 2025

అధికారులకు బాపట్ల కలెక్టర్ ఆదేశాలు

image

ఇసుక రీచ్‌లలో ఇసుక నిల్వల పెంపుపై చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇసుక కొరత లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ఇసుక రీచ్‌లలో ఉన్న ఇసుక నిల్వలపై గనుల శాఖ అధికారులతో ఆయన ఆరా తీశారు.

error: Content is protected !!