News August 31, 2025
రేపు మన పాఠశాల-మన ఆత్మగౌరవం: మెదక్ ఎంపీ

సంగారెడ్డి జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో సోమవారం మన పాఠశాల-మన ఆత్మగౌరవం కార్యక్రమాన్ని నిర్వహించాలని మెదక్ ఎంపీ రఘునందన్‌రావు అన్నారు. సంగారెడ్డిలో తపస్ ఆధ్వర్యంలో రూపొందించిన కరపత్రాలు ఆదివారం ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. మన పాఠశాల ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకు ఈ కార్యక్రమం అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్, నాయకుడు మాధవరెడ్డి పాల్గొన్నారు.
Similar News
News October 26, 2025
31న మెదక్‌లో బ్యాడ్మింటన్ టోర్నమెంట్: DSP

పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా ఈ నెల 31న మెదక్ పట్టణంలోని పీఎన్‌ఆర్ స్టేడియంలో బ్యాడ్మింటన్ డబుల్స్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు డీఎస్పీ ప్రసన్న కుమార్ తెలిపారు. ఇది ‘ఓపెన్ టు ఆల్’ టోర్నమెంట్ అని, 30న సాయంత్రం 5 గంటలలోగా ఆర్‌ఎస్‌ఐ నరేష్(87126 57954) వద్ద పేరు నమోదు చేసుకోవాలని సూచించారు. ఎస్పీ శ్రీనివాసరావు, ఏఎస్పీ మహేందర్ ఆధ్వర్యంలో విజేతలకు బహుమతులు అందజేస్తామని పేర్కొన్నారు.
News October 26, 2025
మెదక్: నేడు స్వగ్రామానికి మృతదేహాలు

కర్నూలు సమీపంలో జరిగిన బస్సు ప్రమాదంలో సజీవ దహనమైన తల్లీ, కూతురు మృతదేహాలు ఇవాళ రాత్రి వరకు స్వగ్రామానికి రానున్నాయి. మెదక్ మండలం శివాయిపల్లికి చెందిన మంగ సంధ్యారాణి(43), కుమార్తె చందన(23) బస్సు ప్రమాదంలో చనిపోయిన విషయం తెలిసిందే. DNA పరీక్షల అనంతరం మృతదేహాలను ఇవాళ సాయంత్రం కుటుంబీకులకు అప్పగించారు. రేపు అంత్యక్రియలు జరగనున్నాయి. కాగా శుక్రవారం నుంచి శివ్వాయిపల్లిలో విషాదం నెలకొంది.
News October 26, 2025
చిన్న శంకరంపేట: గుర్తుతెలియని మహిళా మృతదేహం లభ్యం

చిన్న శంకరంపేట మండలం దరిపల్లి శివారులోని హల్దీ వాగులో గుర్తు తెలియని మహిళ శవం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. మృతి చెందిన మహిళ ఎవరు అనేది ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. గ్రామంలో ఎవరైనా తప్పిపోయారా లేదా ఇతర గ్రామాల నుంచి వచ్చిన మహిళ ఇక్కడ చనిపోయిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


