News January 28, 2026

రేపు మామునూర్ ఎయిర్‌పోర్ట్ భూముల అప్పగింత

image

వరంగల్ ప్రజల దశాబ్దాల కల అయిన మామునూరు విమానాశ్రయ పనులు కీలక దశకు చేరుకున్నాయి. విమానాశ్రయ విస్తరణ కోసం తెలంగాణ ప్రభుత్వం సేకరించిన 260 ఎకరాల భూమికి సంబంధించిన అధికారిక పత్రాలను వరంగల్ కలెక్టర్ సత్య శారద గురువారం హైదరాబాద్‌లో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుకు అందజేయనున్నారు.

Similar News

News February 10, 2026

ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం పడనివ్వం: చంద్రబాబు

image

AP: ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం పడనివ్వమని CM చంద్రబాబు స్పష్టం చేశారు. విద్యుత్ కొనుగోలు భారాన్ని కూడా తగ్గించుకునేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అగ్నిమాపక, పురపాలక, అటవీ, స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్‌లో నిబంధనలు సరళతరం చేయాలన్నారు. కేంద్రం నిధులను సమర్థవంతంగా వినియోగించుకోవాలని మంత్రులు, కార్యదర్శులతో సమావేశంలో పేర్కొన్నారు. పన్ను వసూళ్లు తగ్గకూడదని, వ్యాపారులను వేధించకూడదని చెప్పారు.

News February 10, 2026

ఫిబ్రవరి 10: చరిత్రలో ఈరోజు

image

☛ 1921: ఇండియా గేట్‌కు శంకుస్థాపన
☛ 1923: X-కిరణాల సృష్టికర్త విల్హేల్మ్ కన్రాడ్ రాంట్జెన్ మరణం
☛ 1985: సినీ గాయని ప్రియా హిమేశ్ జననం
☛ 1990: సింగర్ రేవంత్ జననం
☛ 1993: స్వాతంత్ర్య సమరయోధుడు గయా ప్రసాద్ కటియార్ మరణం (ఫొటోలో)
☛ 2010: భారత ఆర్థికవేత్త, తొలి ప్రణాళికా సంఘం సభ్యుడు KN.రాజ్ మరణం
☛ జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం

News February 10, 2026

విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించాలి: హన్మకొండ కలెక్టర్

image

హన్మకొండ జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, హాస్టల్స్‌లో విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించాలని డీఎంహెచ్ఓ డాక్టర్ అప్పయ్యను కలెక్టర్ స్నేహశబరీష్ ఆదేశించారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ నివేదిక అందజేయాలని సూచించారు. టెన్త్ విద్యార్థులకు పరీక్షల సమయం దగ్గరపడుతోందని ఆరోగ్యంగా ఉంటేనే చదువులో రాణిస్తారని చెప్పారు.