News January 17, 2026

రేపు మూడో వన్డే.. స్టార్ ప్లేయర్ రిటైర్మెంట్?

image

ఎల్లుండి న్యూజిలాండ్‌తో మూడో వన్డే తర్వాత భారత ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా రిటైర్మెంట్ ప్రకటిస్తారని ప్రచారం జరుగుతోంది. గత కొంత కాలంగా ఫామ్‌లో లేకపోవడంతో ఇదే చివరి వన్డే అని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ సిరీస్‌లో రెండు మ్యాచుల్లో అటు బ్యాట్‌తో, ఇటు బంతితోనూ జడ్డూ ప్రభావం చూపలేకపోయారు. ఇప్పటివరకు ఆడిన 209 వన్డేల్లో 2,893 రన్స్ చేయగా 232 వికెట్లు తీశారు. ఇప్పటికే T20Iలకు రిటైర్మెంట్ ప్రకటించారు.

Similar News

News February 19, 2026

వాళ్లు ఇండియాను ఓడించలేదు: పాక్ క్రికెటర్

image

ఇండియాతో మ్యాచ్‌లో పాక్ <<19153355>>ఘోరంగా<<>> ఓడిపోవడం తెలిసిందే. ఈ క్రమంలో తమపై <<19155191>>తీవ్ర విమర్శలు<<>> చేస్తున్న మాజీలకు పాక్ ఆల్‌రౌండర్ షాదాబ్ ఖాన్ కౌంటర్ ఇచ్చారు. ‘మాజీ క్రికెటర్లకు వాళ్ల సొంత అభిప్రాయాలు ఉంటాయి. వారు దిగ్గజాలు. కానీ మేం చేసినట్లు వాళ్లు చేయలేదు. మేం ప్రపంచకప్‌లో ఇండియాను ఓడించాం. అయినా విమర్శలనేవి క్రికెట్ చరిత్రలో భాగం’ అని అన్నారు. 2021 T20 WCలో ఇండియాపై పాక్ గెలిచింది.

News February 19, 2026

ఫిబ్రవరి 19: చరిత్రలో ఈరోజు

image

1473: ఖగోళ శాస్త్రవేత్త నికోలస్ కోపర్నికస్ జననం
1630: మరాఠా సామ్రాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ జననం
1915: స్వాతంత్య్ర సమర యోధుడు గోపాలకృష్ణ గోఖలే మరణం
1930: సినీ దర్శకుడు, నటుడు కె.విశ్వనాథ్ జననం
2009: తెలుగు నటి నిర్మలమ్మ మరణం
2018: హాస్యనటుడు గుండు హనుమంతరావు మరణం

News February 19, 2026

NCERT ‘ఇ-మ్యాజిక్ బాక్స్’.. AIతో ఇక సరదాగా చదువు

image

3 నుంచి 8 ఏళ్ల చిన్నారుల కోసం NCERT సరికొత్త AI ఆధారిత ‘ఇ-మ్యాజిక్ బాక్స్’ యాప్‌ను లాంచ్ చేసింది. ఇందులో కథలు చెప్పే ‘కథా సఖి’, తల్లిదండ్రుల సందేహాలు తీర్చే ‘పేరెంట్ తార’, ఉపాధ్యాయులకు బోధనలో సాయపడే ‘టీచర్ తార’ అనే 3 స్మార్ట్ బాట్‌లు ఉన్నాయి. ఆటపాటల ద్వారా పిల్లల్లో క్రియేటివిటీని పెంచడంతో పాటు వారు అడిగే ప్రశ్నలకు ఈ యాప్ వెంటనే AI సాయంతో సమాధానాలిస్తుంది.