News October 23, 2025
రేపు మేడారానికి మంత్రులు.. కొండా సురేఖ కూడా..?

మేడారం మహా జాతర పనుల పర్యవేక్షణ కోసం రాష్ట్ర మంత్రుల బృందం శుక్రవారం వస్తున్నట్లు తెలిసింది. ఇటీవల జరిగిన మంత్రుల పర్యటనలో దేవాదాయ మంత్రి కొండా సురేఖ గైర్హాజరవ్వడం తీవ్ర చర్చ జరగడంతో పాటు వివాదాలకు కారణమైంది. మీనాక్షి నటరాజ్ చొరవతో వివాదం సద్దుమనగగా.. రేపటి పర్యటనలో సురేఖ కూడా ఉంటారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కలెక్టర్ దివాకర ఈరోజు మేడారంలో పర్యటించి వన దేవతల గద్దెల పనులను పర్యవేక్షించారు.
Similar News
News October 23, 2025
నల్గొండ: తండ్రి మందలించాడని సూసైడ్

చిట్యాల మండలం చిన్నకాపర్తికి చెందిన యువకుడు రుద్రారపు చందు (25) పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చిట్యాల ఎస్ఐ రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. చందు ట్రాక్టర్ మెకానిక్. ప్రతిరోజు చిట్యాలకు వెళ్లి ఇంటికి ఆలస్యంగా వస్తున్నాడు. దీంతో తండ్రి మందలించగా మనస్తాపానికి గురై పురుగు మందు తాగాడు. పెద్దకాపర్తి సబ్ స్టేషన్ వద్ద పడి ఉండగా ఆసుపత్రిలో చేర్పించగా గురువారం మృతి చెందాడు.
News October 23, 2025
విద్యారంగ బలోపేతం దిశగా ప్రభుత్వం కృషి: కలెక్టర్

ప్రభుత్వ విద్యా సంస్థలను బలోపేతం చేస్తూ, విద్యార్థులకు సకల సదుపాయాలతో కూడిన నాణ్యమైన విద్యను అందిస్తూ విద్యారంగ బలోపేతం దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. భీమారం మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించి, తరగతి గదులు, వంటశాల, మధ్యాహ్న భోజనం నాణ్యత, రిజిస్టర్లు, పరిసరాలను పరిశీలించారు. మెనూ ప్రకారం పోషక విలువలతో కూడిన ఆహారం అందించాలని సూచించారు.
News October 23, 2025
ఓయూలో రివాల్యుయేషన్‌కు దరఖాస్తుల ఆహ్వానం

ఓయూ ఎంసీఏ పరీక్షల ఫలితాల రివాల్యుయేషన్‌కు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఎంసీఏ మెయిన్, బ్యాక్ లాగ్ పరీక్షల ఫలితాల రివాల్యుయేషన్‌కు దరఖాస్తు చేసుకోవాలనుకుంటే ఒక్కో పేపర్‌కు రూ.800 చొప్పున చెల్లించి ఈనెల 27వ తేదీలోగా, రూ.200 అపరాధ రుసుముతో 29వ తేదీ వరకు చెల్లించవచ్చన్నారు. జవాబు పత్రాల నకలు పొందేందుకు ఒక్కో పేపర్‌కు రూ.1,000 చొప్పున చెల్లించి 27 వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు.