News August 31, 2025

రేపు యథావిధిగా పీజీఆర్ఎస్ కార్యక్రమం: కలెక్టర్

image

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమం మండలం, డివిజనల్, మున్సిపల్ కార్యాలయంలో సోమవారం యథావిధిగా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వెట్రిసెల్వి ఆదివారం తెలిపారు. జిల్లా స్థాయిలో కలెక్టరేట్‌లో యథావిధిగా ఉదయం 10 గంటలకు ఫిర్యాదులు స్వీకరిస్తామన్నారు. ప్రజలు https://meekosam.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా ఇంటి నుంచే ఫిర్యాదు చేయొచ్చన్నారు. PGRSను ప్రజలు వినియోగించుకుని సమస్యలు పరిష్కరించుకోవాలన్నారు.

Similar News

News September 3, 2025

HYD: SEP 17న TG విమోచన దినోత్సవం: BJP

image

సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో అధికారికంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించనున్నట్లుగా బీజేపీ TG చీఫ్ రాంచందర్‌రావు తెలిపారు. వారం రోజుల ముందుగానే పరేడ్ గ్రౌండ్లో అన్ని ఏర్పాట్లు ప్రారంభం కానున్నాయన్నారు. గతంలో కంటే ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఆయన తెలిపారు.

News September 3, 2025

మాడగడలో పవన్ కళ్యాణ్ పర్యటన షెడ్యూల్

image

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అరకు నియోజకవర్గ పర్యటన ఖరారైంది. ఈ మేరకు పర్యటన వివరాలు అధికారికంగా విడుదల చేశారు. ఈ నెల 5వ తేదీన ఉదయం 7.45 నిమిషాలకు గన్నవరం నుంచి ఫ్లైట్లో విశాఖ బయలుదేరుతారు. విశాఖ ఎయిర్ పోర్టు నుంచి 8.50 గంటలకు రోడ్డు మార్గం ద్వారా 11.30 లకు మాడగడలో జరుగుతున్న భలి ఉత్సవంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 3 గంటలకు అక్కడ నుంచి తిరుగు ప్రయాణం అవుతారు.

News September 3, 2025

తీవ్ర అల్పపీడనం ఎఫెక్ట్.. ఆ జిల్లాల్లో భారీ వర్షాలు

image

AP: వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్రంగా మారినట్లు APSDMA తెలిపింది. అది 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా ఒడిశా వైపు కదులుతుందని పేర్కొంది. దీని ప్రభావంతో శ్రీకాకుళం, మన్యం, అల్లూరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. గంటకు 40-60 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది.