News October 12, 2025

రేపు యథావిధిగా ప్రజావాణి..

image

వనపర్తి కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం రేపటినుంచి యథావిధిగా కొనసాగనుంది. ప్రస్తుతం ఎన్నికల నిర్వహణ ప్రక్రియ నిలిచిపోవడంతో అధికారులు రేపు తిరిగి ప్రారంభిస్తున్నారు. సోమవారం నిర్వహించే కార్యక్రమాన్ని జిల్లాలోని బాధితులు, అర్జీదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల నియమావళి అమల్లోకి రావడంతో ప్రజావాణిని జిల్లా కలెక్టర్ తాత్కాలికంగా రద్దు చేసిన సంగతీ తెలిసిందే.

Similar News

News October 13, 2025

జూబ్లీ సిత్రాలు: ‘Chai Lelo.. భాయ్’

image

జూబ్లీహిల్స్‌లో ప్రధాన పార్టీలు ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నేతల హడావిడి మామూలుగా లేదు. వెంకటగిరి‌ ‘సండే మార్కెట్‌’‌ను అవకాశంగా భావించిన నేతలు పార్టీ కండువాలతో ప్రత్యక్ష్యమయ్యారు. చిరువ్యాపారులను పలకరించి, ఉపఎన్నికను గుర్తుచేశారు. వెంకటగిరి బస్తీలో BRS తరఫున ప్రచారం చేసిన అంబర్‌పేట MLA కాలేరు వెంకటేశ్‌కు అభ్యర్థి మాగంటి సునీత ‘లేలో భాయ్’ అని ఓ కప్పు ఛాయ్ అందించారు.

News October 13, 2025

చిత్తూరు జిల్లా ప్రజలకు గమనిక

image

చిత్తూరు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎస్పీ తుషార్ డూడీ తెలిపారు. ఉదయం 10.30 గంటలకు పాత డీపీఓ కార్యాలయంలో కార్యక్రమం ఉంటుందన్నారు. ప్రజలు తమ సమస్యలపై వినతులు ఇవ్వొచ్చని ఆయన కోరారు.

News October 13, 2025

చిన్నారి సేఫ్.. పోలీసులకు SP అభినందన

image

దర్గామిట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని బ్లూమూన్ లాడ్జిలో శనివారం రాత్రి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆ సమయంలో లాడ్జిలో ఉన్న వారిని క్షేమంగా బయటికి తీశారు. అందులో ఓ చిన్నారి స్వల్ప అస్వస్థతకు గురయ్యడు. వెంటనే అతన్ని హాస్పిటల్‌కి తరలించారు. ప్రస్తుతం ఆ చిన్నారి ఆరోగ్యం బాగుందని పోలీసులు తెలిపారు. లాడ్జిలో ఉన్న మొత్తం 14 మందిని పోలీసులు రక్షించారు. దీంతో సిబ్బందిని SP అజిత అభినందించారు.