News October 12, 2025

రేపు యథావిధిగా PGRS: కలెక్టర్

image

ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS)ను సోమవారం యథావిధిగా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ జి. లక్ష్మీశ ఆదివారం ప్రకటించారు. విజయవాడ కలెక్టరేట్‌లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో ఉదయం 10 గంటల నుంచి ప్రజల వద్ద ఫిర్యాదులు స్వీకరించనున్నట్లు చెప్పారు. కలెక్టరేట్, డివిజన్, మునిసిపల్, మండల స్థాయిల్లో అధికారులు అర్జీలు స్వీకరిస్తారని తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Similar News

News October 12, 2025

వేరుశనగలో ఇనుపధాతులోపం.. నివారణ

image

ఆకులలో పత్రహరితం తయారవడానికి ఇనుపధాతు కీలకం. ఇది లోపించినప్పుడు వేరుశనగ మొక్క ఆకులు పసుపు రంగుకు మారతాయి. క్రమంగా ఆకు కొనలు ఎండిపోతాయి. మొక్క ఎదుగుదల ఆగిపోతుంది. ఈ సమస్య నివారణకు 0.5 శాతంఅన్నబేధి(5గ్రా. లీటరు నీటికి), 0.1 శాతం నిమ్మఉప్పు(లీటరు నీటికి 1గ్రాము) కలిపిన ద్రావణాన్ని 4-5 రోజుల వ్యవధిలో 2-3సార్లు పిచికారీ చేసుకోవాలి.

News October 12, 2025

వరంగల్: 97%తో రికార్డు స్థాయిలో పల్స్ పోలియో

image

నేటి ప్రత్యేక పల్స్ పోలియో కార్యక్రమం వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉత్సాహంగా జరిగింది. మొత్తం 20,101 మంది పిల్లలకు లక్ష్యంగా, 19,546 మందికి పోలియో వ్యాక్సిన్ వేసి 97 శాతం రికార్డు సాధించామని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.బి.సాంబశివరావు తెలిపారు. పిల్లలకు తల్లిదండ్రులు పోలియో చుక్కలు తప్పక వేయించాలన్నారు.

News October 12, 2025

KPHBలో వ్యభిచారం.. అరెస్ట్

image

KPHB రోడ్డు పక్కన వ్యభిచారం నిర్వహిస్తున్న ప్రధాన నిర్వాహకుడు దీలీప్ సింగ్‌ (46)ను పోలీసులు అరెస్టు చేశారు. పక్కా సమాచారంపై పోలీసులు దాడి చేసి, అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి, న్యాయస్థానం ఆదేశాల మేరకు అతనిని జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. వ్యభిచారం, అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు కొనసాగుతాయని KPHB పోలీసులు తెలిపారు.