News December 29, 2024
రేపు యధావిధిగా పీజీఆర్ఎస్: కలెక్టర్
రాజమహేంద్రవరంలోని జిల్లా కలెక్టరేట్ వద్ద సోమవారం యథావిధిగా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని కలెక్టర్ ప్రశాంతి తెలిపారు. ఈ మేరకు ఆమె ఆదివారం మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ మేరకు సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని కలెక్టర్ తెలిపారు.
Similar News
News January 1, 2025
కడియం: 4న గేమ్ ఛేంజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్
తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం వేమగిరిలో గేమ్ ఛేంజర్ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఈ నెల 4న సాయంత్రం 6గంటలకు ఈవెంట్ ప్రారంభించనున్నట్లు రాష్ట్ర చిరంజీవి, రామ్ చరణ్ యువత కమిటీ సభ్యుడు ఏడిద బాబి తెలిపారు. మంగళవారం సాయంత్రం మహానాడు నిర్వహించిన మైదానాన్ని A-మీడియా ఛైర్మన్ నరేంద్ర వచ్చి పరిశీలించినట్లు ఆయన తెలిపారు. డిప్యూటీ సీఎం పవన్ ముఖ్య అతిథిగా పాల్గొంటారన్నారు.
News December 31, 2024
పేపర్ లీక్ చేసిన వ్యక్తి ఉమ్మడి తూ.గో. వాసే
పదో తరగతి SA-1 పరీక్షల్లో లెక్కల పేపర్ లీక్‌కు కారణమైన ఉమ్మడి తూ.గో.(D) రామచంద్రపురం మండల విద్యాశాఖాధారితోపాటు టీచర్ సుబ్బారావును విజయవాడ సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిని కోర్టులో సోమవారం హాజరుపరచగా రిమాండ్ విధించారు. మండలంలోని హైస్కూల్‌లో ఓ విద్యార్థికి ప్రశ్నపత్రాన్ని ఆయన ఇవ్వగా.. బాలిక టెలిగ్రామ్ ఛానల్‌లో అప్‌లోడ్ చేసింది. వెంటనే ఓ యూట్యూబ్ ఛానల్‌లో ప్రత్యక్షమవడంతో విషయం తెలిసింది.
News December 31, 2024
కోరుకొండ: రేవ్ పార్టీలో 19 మంది అరెస్ట్.. వివరాలివే
కోరుకోండలోని రేవ్ పార్టీపై పోలీసులు దాడి చేసి మొత్తం 19 మందిని అరెస్ట్ చేశారు. గోపాలకృష్ణ అనే వ్యక్తి రూ.18వేలకు ఫంక్షన్ హాల్ బుక్ చేసి పార్టీ నిర్వహించారు. ఇక్కడికి TNK, ఆచంట, గోపాలపురానికి చెందిన 10మంది ఎరువుల డీలర్లను రప్పించారు. కాకినాడకు చెందిన మహిళ ద్వారా ఐదుగురు అమ్మాయిలను రప్పించి వారితో డీలర్లు మద్యం తాగుతూ డ్యాన్స్ చేశారు. ఫంక్షన్ హాల్ యజమాని కుమారుడు, 10మంది డీలర్లపై కేసు నమోదు చేశారు.