News February 22, 2025
రేపు యాదగిరిగుట్టకు కేసీఆర్ వస్తారా..?

యాదగిరిగుట్ట స్వర్ణ విమాన గోపుర మహా కుంభాభిషేకం కార్యక్రమానికి కేసీఆర్‌కు పూజారులు ఆహ్వానం అందించారు. అనంతరం జరిగే యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాలకు రావాల్సిందిగా కోరారు. ఈనెల 23న మహా కుంభాభిషేకం కార్యక్రమం జరుగనుంది. కాగా, గతంలో గుట్టలో నిర్వహించిన కార్యక్రమాలకు హాజరుకాని కేసీఆర్ ఇప్పుడు వస్తారా అనేది చూడాలి.
Similar News
News November 14, 2025
4 రౌండ్లు ముగిసే సరికి ఆధిక్యంలో కాంగ్రెస్

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ దూసుకెళ్తోంది. నాలుగో రౌండ్ ముగిసేసరికి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 9వేల ఓట్లకు పైగా ఆధిక్యంలో ఉన్నారు. ఇప్పటివరకు 4 రౌండ్లలోనూ ఆయన లీడ్ సాధించారు. BRSకు మూడో రౌండ్‌లోని ఒక EVMలో స్వల్ప ఆధిక్యం వచ్చింది. ప్రస్తుతం ఐదో రౌండ్ ఓట్లు లెక్కిస్తున్నారు.
News November 14, 2025
వంటింటి చిట్కాలు

* పండ్లు, కూరగాయలు త్వరగా పాడవకుండా ఉండాలంటే వేడినీళ్లలో రెండు టేబుల్ స్పూన్ల వెనిగర్ వేసి కడగాలి. ఆ తర్వాత సాధారణ నీటితో కడగాలి.
* దోసెలు పెనానికి అతుక్కుపోకుండా ఉండాలంటే ముందుగా పెనంపై వంకాయ లేదా ఉల్లిపాయ ముక్కతో రుద్దితే చాలు.
* కాకరకాయ కూరలో సోంపు గింజలు/ బెల్లం వేస్తే చేదు తగ్గుతుంది.
* పుదీనా చట్నీ కోసం మిక్సీలో పదార్థాలని ఎక్కువ సేపు తిప్పకూడదు. ఇలా చేస్తే చేదుగా అయిపోతుంది.
News November 14, 2025
45 వేల మెజారిటీతో గెలుస్తా: నవీన్ యాదవ్

ఉదయం కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కుటుంబ సమేతంగా బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో పూజలు చేశారు. జూబ్లీహిల్స్‌లో తానే గెలవబోతున్నానని కామెంట్ చేశారు. ప్రజల ఆశీస్సులతో మంచి మెజారిటీ వస్తుందని, ఫస్ట్ రౌండ్ నుంచే తనకు మంచి లీడ్ మొదలవుతుందని ఆశించారు. 45 వేల మెజారిటీతో గెలుస్తున్నామని నవీన్ యాదవ్ తెలిపారు. అయితే, ఆయన ఆశించిన స్థాయిలోనే 4 రౌండ్లలో INC లీడ్‌లో ఉంది.


