News March 17, 2025
రేపు యాదగిరిగుట్ట గిరి ప్రదక్షిణ

ఈనెల 18న యాదగిరిగుట్ట గిరి ప్రదక్షిణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. యాదగిరిగుట్ట క్షేత్రంలో కొలువైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం రోజున గిరి ప్రదక్షిణ నిర్వహిస్తున్నారు. ఈ నెల 18న గిరి ప్రదిక్షణకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొననున్నారు. కాగా ఈ నెల 14 వరకు ఉత్సవాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి అన్ని ఏర్పాటు చేశామని ఆలయ ఈవో భాస్కర్ రావు తెలిపారు.
Similar News
News February 24, 2026
BREAKING: MNCL: బాల్కసుమన్ కస్టడీ పిటిషన్ విచారణ వాయిదా

మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కస్టడీ పిటిషన్ విచారణను ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఈనెల 26కు వాయిదా వేశారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు, సుమన్ తరఫు న్యాయవాదుల ప్రతివాదనలు విన్న తర్వాత విచారణ వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. క్యాతనపల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక విషయంలో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో సుమన్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
News February 24, 2026
సూర్యోదయ తిథి ఆధారంగా పండుగలు ఎందుకు?

హిందూ క్యాలెండర్ ప్రకారం పండుగలు, ఉపవాసాలు తిథులపై ఆధారపడి ఉంటాయి. తిథి అనేది సూర్యచంద్రుల గమనాన్ని బట్టి మారుతుంటుంది. అందుకే ఇది ఇంగ్లీష్ తేదీలలా 24 గంటలు స్థిరంగా ఉండదు. అయితే సూర్యోదయ సమయంలో ఏ తిథి ఉంటుందో ఆ రోజంతా అదే తిథిగా పరిగణిస్తారు. పగలు జరుపుకొనే పండుగలను ఆరోజే నిర్వహిస్తారు. రాత్రిపూట జరుపుకొనే పండుగలకు మాత్రం ఆయా సమయాల్లో ఉన్న తిథిని బట్టి జరుపుతారు.
News February 24, 2026
HYD: 3 కార్పొరేషన్ల వెబ్ సైట్లు ఇవే!

300 డివిజన్లతో కూడిన GHMC మూడుముక్కలైన విషయం తెలిసిందే. GHMC, సైబరాబాద్, మల్కాజిగిరి కార్పొరేషన్లకు సంబంధించిన వెబ్‌సైట్లు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. GHMC వెబ్‌సైట్ www.ghmc.gov.in, సైబరాబాద్ కార్పొరేషన్ cmc.telangana.gov.in, మల్కాజిరి కార్పొరేషన్ mmc.telangana.gov.in వెబ్‌సైట్లలో ప్రజలు సేవలు పొందొచ్చని అధికారులు తెలియజేశారు.
# SHARE IT


