News November 10, 2025

రేపు రూ.477 కోట్లతో పరిశ్రమలకు శంకుస్థాపన

image

పెళ్లకూరు(M) సిరసనంబేడులో మంగళవారం రూ.477 కోట్ల పెట్టుబడులతో పరిశ్రమలకు మంత్రి నిమ్మల రామానాయుడు శ్రీకారం చుట్టనున్నారు. ఉ.10 గంటలకు MSME పార్కు సహా మూడు భారీ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. CM చంద్రబాబు అమరావతి నుంచి వర్చువల్‌గా పాల్గొని ప్రసంగించనున్నట్లు సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ కార్యాలయం తెలిపింది.

Similar News

News November 10, 2025

VKB: జిల్లా వైద్యాధికారిగా స్వర్ణకుమారి

image

జిల్లాలో గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడం లక్ష్యంగా పనిచేస్తామని జిల్లా వైద్యాధికారి స్వర్ణకుమారి తెలిపారు. సోమవారం వికారాబాద్ జిల్లా వైద్యాధికారిగా స్వర్ణకుమారి బాధ్యతలను స్వీకరించారు. ఆమె మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో వైద్యులు అందుబాటులో ఉంటూ గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు.

News November 10, 2025

NOV 25వరకు SSC పరీక్ష ఫీజు చెల్లింపు గడువు

image

AP: టెన్త్ పబ్లిక్ పరీక్ష ఫీజును నవంబర్ 13నుంచి 25వరకు చెల్లించవచ్చని SSC బోర్డు డైరెక్టర్ శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. లేట్ ఫీ ₹50తో డిసెంబర్ 3వరకు, ₹200తో DEC 10వరకు, ₹500తో DEC 12వరకు చెల్లించవచ్చని చెప్పారు. ఫీజును https://bse.ap.gov.in లో స్కూల్ లాగిన్ ద్వారా మాత్రమే చెల్లించాలని పేర్కొన్నారు. బ్యాంక్ చలానా, CFMS చెల్లింపులను ఆమోదించబోమని వివరించారు. గడువు పొడిగింపు ఉండదని స్పష్టంచేశారు.

News November 10, 2025

ఢిల్లీ పేలుడు ఘటన.. కాజీపేట రైల్వే స్టేషన్‌లో తనిఖీలు

image

ఢిల్లీలో జరిగిన బాంబు పేలుళ్ల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తుగా కాజీపేట రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలను సీఐ సుధాకర్ రెడ్డి నేతృత్వంలో తనిఖీలు చేపట్టారు. ప్లాట్‌ఫాంపై ఉన్న ప్రయాణికులను, అనుమానితులను, వారి లగేజ్ బ్యాగులను క్షుణ్ణంగా పరిశీలించారు. అనుమానిత వ్యక్తులు కనిపిస్తే వెంటనే సమాచారం అందించాలని సీఐ సూచించారు.