News June 27, 2024

రేపు వరంగల్‌కు సీఎం.. ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

image

వరంగల్ జిల్లా గీసుగొండ మండలం కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కుకు శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు. ఈ మేరకు వరంగల్ కలెక్టర్ సత్య శారదాదేవి అక్కడి ఏర్పాట్లను సంబంధిత అధికారులతో పరిశీలించారు. పార్కులో చేపట్టిన పనులు, ఫొటో ఎగ్జిబిట్లను సీఎం తిలకిస్తారని చెప్పారు. అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీసీపీ రవీందర్ తదితరులు ఉన్నారు.

Similar News

News October 9, 2024

BHPL: 12వ తేదీన రావణసుర వధ కార్యక్రమం

image

గోరి కొత్తపల్లి మండల కేంద్రంలో స్నేహ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 12వ తేదీన రాత్రి 8 గంటలకు రావణాసుర వాద కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు యూత్ అధ్యక్షుడు ఆవుల రాజు తెలిపారు. మండలంలో తొలిసారిగా రావణ వధ కార్యక్రమాన్ని చేపడుతున్నామని, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని రాజు పిలుపునిచ్చారు.

News October 9, 2024

వరంగల్ మార్కెట్లో పత్తి ధరలు

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో పాత పత్తి ధర నిన్నటి లాగే తటస్థంగా ఉంది. మంగళవారం క్వింటా పాత పత్తి రూ.7,450 ధర పలకగా.. నేడు కూడా రూ.7450 పలికినట్లు అధికారులు తెలిపారు. అలాగే కొత్తపత్తి ధర నిన్న రూ.6,960 పలకగా.. నేడు రూ.6,930కి తగ్గినట్లు పేర్కొన్నారు. కాగా, నేడు మార్కెట్‌‌కు పత్తి తరలివచ్చింది.

News October 9, 2024

నల్లబెల్లి: చదువుల తల్లికి ఐదు ప్రభుత్వ కొలువులు

image

నల్లబెల్లి మండల కేంద్రానికి చెందిన వడ్లూరి విష్ణు రమాదేవి దంపతుల కుమార్తె శ్వేత ఐదు గెజిటెడ్ ఉద్యోగాలు సాధించింది. ఏఈఈ ఫలితాలలో రాష్ట్ర స్థాయిలో మహిళా విభాగంలో 7వ ర్యాంకు సాధించి, ఆర్ అండ్ బి సబ్ డివిజన్ కరింనగర్‌లో ఉద్యోగం సాధించింది. పాలిటెక్నిక్ లెక్చరర్ ఫలితాలలో రెండో ర్యాంకు, ఏఈ ఫలితాలలో మూడో ర్యాంక్, టౌన్ ప్లానింగ్ ఫలితాలలో 14 ర్యాంక్, ఇస్రో ఫలితాలలో జాతీయ స్థాయిలో టాపర్‌గా నిలిచింది.