News May 26, 2024

రేపు వరంగల్ జిల్లాలో 144 సెక్షన్ అమలు

image

ఈనెల 27న జరిగే వరంగల్‌–నల్గొండ–ఖమ్మం ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా కమిషనరేట్‌ పరిధిలో 144 సెక్షన్‌ అమలు చేస్తున్నట్లు వరంగల్ సీపీ అంబర్‌ కిషోర్‌ ఝా ఓ ప్రకటనలో తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎన్నిక ప్రశాంతంగా నిర్వహించేందుకు ఈనెల 27న ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు 144 సెక్షన్‌ అమలులో ఉంటుందని పేర్కొన్నారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు.

Similar News

News September 13, 2025

వరంగల్ జిల్లాలో తగ్గుముఖం పట్టిన వర్షాలు

image

వరంగల్ జిల్లాలో శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు తేలికపాటి వర్షపాతం నమోదైంది. తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ విడుదల చేసిన నివేదిక ప్రకారం, మొత్తం జిల్లా వ్యాప్తంగా 18.1 మి.మీ. వర్షపాతం నమోదైంది. వీటిలో ఎక్కువ వర్షం నెక్కొండ మండలంలో 14.9 మి.మీగా నమోదు కాగా, పర్వతగిరిలో 2.7 మి.మీ, రాయపర్తిలో 0.5 మి.మీ వర్షం కురిసింది.

News September 12, 2025

ఎనుమాముల బియ్యం నిల్వ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్

image

ఎనుమాముల మండల బియ్యం నిల్వ కేంద్రాన్ని కలెక్టర్ సత్య శారద ఆకస్మికంగా సందర్శించి సమగ్ర తనిఖీ నిర్వహించారు. నిల్వలో ఉన్న బియ్యం నాణ్యత, భద్రతా ఏర్పాట్లు, నిల్వ విధానం, రికార్డుల నిర్వహణను జాగ్రత్తగా పరిశీలించారు. సమర్థంగా నిర్వహణ కొనసాగించి రైతులకు, వినియోగదారులకు నాణ్యమైన బియ్యం అందేలా చర్యలు మరింత పటిష్టం చేయాలని సూచించారు.

News September 12, 2025

వరంగల్: బియ్యం నిల్వపై జిల్లా కలెక్టర్ ఆగ్రహం

image

ఏనుమాముల బియ్యం నిల్వ కేంద్రంలో ముక్కిన బియ్యం, మధ్యాహ్న భోజన పథకం బియ్యాన్ని కలిపి ఉంచిన వ్యవహారంపై వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంలో తనిఖీలు నిర్వహించిన ఆమె, ఈ నిర్లక్ష్యానికి కారణమైన పౌరసరఫరాల డీఎం, ఎం.ఎల్.ఎస్. ఇన్‌ఛార్జిలకు నోటీసులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు.