News December 31, 2025

రేపు వరంగల్ మార్కెట్‌కు సెలవు

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ గురువారం బంద్ ఉండనుంది. ఆంగ్ల నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని గుమాస్తా, దడవాయి, హమాలీ, వ్యాపారుల కోరిక మేరకు మార్కెట్‌కు సెలవు ప్రకటిస్తున్నట్లు అధికారులు తెలిపారు. తిరిగి శుక్రవారం మార్కెట్ పునఃప్రారంభం అవుతుందని పేర్కొన్నారు. కాగా జిన్నింగు మిల్లులు, సీసీఐ కొనుగోళ్లు యధావిధిగా జరుగుతాయన్నారు.

Similar News

News January 2, 2026

కవిత BRSలో ఉన్నారా.. ఏమి?: కోమటిరెడ్డి

image

TG: KCR శాసనసభకు వస్తే BRS పుంజుకుంటుందని కవిత పేర్కొనడంపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ‘ఆమె BRSలో ఉన్నారా? అనే అనుమానం వస్తోంది. కేసీఆర్‌ను ఉరితీసినా తప్పు లేదన్నందుకు రక్తం మరిగిపోతోందని ఆమె అంటున్నారు. అంటే కేటీఆర్, హరీశ్‌లను ఉరివేసినా ఫర్వాలేదా? కవిత కన్ఫ్యూజన్‌లో ఉండి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు’ అని విమర్శించారు. తన తమ్ముడితో తనకు విభేదాలు లేవని పేర్కొన్నారు.

News January 2, 2026

విజయవాడ కోర్టులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి హాజరు

image

మద్యం కుంభకోణం కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ MLA చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని పోలీసులు శుక్రవారం విజయవాడ కోర్టులో ప్రవేశపెట్టారు. జిల్లా జైలు నుంచి ఆయనతో పాటు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, చాణిక్య, వెంకటేశ్వర నాయుడు, అనిల్‌లను అధికారులు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. ఈ కేసులో తదుపరి విచారణను కోర్టు కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో కోర్టు పరిసరాల్లో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

News January 2, 2026

సిరిసిల్ల: ఫేక్ ‘స్క్రీన్ షాట్’తో సైబర్ నేరగాళ్ల బురిడీ

image

సైబర్ నేరగాళ్లు ప్రజలను దోచుకోవడానికి సరికొత్త పంథా ఎంచుకున్నారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన ఇద్దరు వ్యక్తులకు సైబర్ కేటుగాళ్లు పొరపాటున మీ ఖాతాకు డబ్బులు పంపించామని నకిలీ పేమెంట్ స్క్రీన్ షాట్లను వాట్సాప్‌కు పంపారు. అవి తమ అవసరాల కోసం ఉంచుకున్న డబ్బులని, తిరిగి పంపాలని నమ్మబలికే ప్రయత్నం చేశారు. అప్రమత్తమైన వ్యక్తులు పోలీసులకు ఫిర్యాదు చేయడానికి సిద్ధమయ్యారు.