News March 25, 2024

రేపు వరంగల్ మార్కెట్ పునఃప్రారంభం

image

మూడు రోజుల విరామం అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ మంగళవారం పున ప్రారంభం కానుంది. మొన్న, నిన్న వారాంతపు సెలవులు, నేడు హోలీ పర్వదినం సందర్భంగా మార్కెట్ బంద్ ఉంది. దీంతో రేపు ప్రారంభం కానుండగా.. రైతులు నాణ్యమైన సరుకులను మార్కెటుకు తీసుకొని వచ్చి మంచి ధర పొందాలని అధికారులు సూచించారు. కాగా ఉదయం 6 గంటల నుంచి మార్కెట్లో కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి.

Similar News

News October 1, 2024

వరంగల్: మార్కెట్లో పత్తి ధరల వివరాలు

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో పత్తి ధర తటస్తంగా ఉంది. సోమవారం క్వింటా పత్తి ధర రూ. 7450 పలకగా… నేడు కూడా అదే ధర పలికింది. అలాగే ఈరోజు మార్కెట్ తరలిరాగా రూ. 6910 ధర వచ్చినట్లు అధికారులు తెలిపారు. అయితే గత వారంతో పోలిస్తే ధరలు పడిపోయాయని వ్యాపారులు తెలుపుతున్నారు. మార్కెట్లో కొనుగోళ్ల ప్రక్రియ కొనసాగుతోంది.

News October 1, 2024

డీఎస్సీ ఫలితాల్లో సత్తాచాటిన నల్లబెల్లి వాసులు

image

నిన్న విడుదలైన డీఎస్సీ ఫలితాల్లో నల్లబెల్లి మండల వాసులు సత్తాచాటారు. నల్లబెల్లికి చెందిన మూటిక ప్రవళిక స్కూల్ అసిస్టెంట్ సైన్స్ విభాగంలో 2 వ ర్యాంకు, ఎస్జీటీ విభాగంలో 7 వ ర్యాంకు కొండ్లె వినయ్, 14వ ర్యాంకు రాయరాకుల రాజేష్, 54వ ర్యాంకు కొండ్లె నాగలక్ష్మి, నారక్క పేట నుండి 70వ ర్యాంక్ వైనాల రవి, 73వ ర్యాంకు అనుముల శ్రీలత డీఎస్సీ ఫలితాల్లో ర్యాంకులు సాధించారు. వీరిని బంధువులు అభినందించారు.

News October 1, 2024

ములుగు జిల్లాలో ఆకాశంలో అద్భుత దృశ్యం

image

ములుగు జిల్లాలో ఆకాశంలో వింత ఘటన చోటు చేసుకుంది. సోమవారం వెంకటాపురంలో ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. ఉదయం ఆకాశంలో మేఘాలు కమ్ముకున్నాయి. సాయంత్రం మేఘాలలో మార్పు రావడంతో మేఘం వింతగా కనిపించింది. ఈ దృశ్యాన్ని పలువురు ఫోనులో బంధించారు. ఇలా మేఘంలో మార్పు రావడానికి దేనికైనా సంకేతమా..? లేక మామూలుగా జరిగిందన్న విషయంపై మండలంలో తీవ్రంగా చర్చ జరుగుతుంది.