News April 1, 2025
రేపు వరంగల్ మార్కెట్ పునః ప్రారంభం

మూడు రోజుల విరామం అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ బుధవారం పునః ప్రారంభం కానుంది. శనివారం అమావాస్య, ఆదివారం వారాంతపు సెలవు, సోమవారం మంగళవారం రంజాన్ సందర్భంగా సెలవు కావడంతో మార్కెట్ బంద్ ఉంది. దీంతో రేపు ప్రారంభం కానుండగా.. రైతులు నాణ్యమైన సరుకులను మార్కెటుకు తీసుకొని వచ్చి మంచి ధర పొందాలని అధికారులు సూచించారు. కాగా, ఉదయం 6 గంటల నుంచి మార్కెట్లో కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి.
Similar News
News April 2, 2025
వరంగల్ మార్కెట్లో ధరల వివరాలు

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో బుధవారం వివిధ రకాల ఉత్పత్తులు తరలిరాగా ధరలు ఇలా ఉన్నాయి. టమాటా మిర్చి క్వింటా ధర రూ.28వేలు, సింగిల్ పట్టికి రూ.28,011 పలికింది. దీపిక మిర్చి క్వింటా ధర రూ.12,500, 1048 రకం మిర్చికి రూ.10వేలు, 5531 మిర్చికి రూ.9వేలు పలికినట్లు వ్యాపారులు తెలిపారు. .
News April 2, 2025
వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పూర్తి చేయండి సారూ!

ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కుగా ఉన్న MGM సరిపోకపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో రూ.1,116 కోట్లతో నగరంలో నిర్మిస్తున్న 24 అంతస్తుల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ను త్వరగా పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురావాలని జిల్లా ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. నిర్మాణంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆలస్యం చేస్తుందని ఆరోపిస్తున్నారు. కాగా, మామునూరు ఎయిర్‌పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.
News April 2, 2025
వరంగల్: గ్రూప్-1 ఫలితాల్లో సత్తా చాటిన యువకుడు

ఐనవోలు మండలం పున్నేలు గ్రామానికి చెందిన ఎండి.విలాయాత్ అలి(25) ఇటీవల ప్రకటించిన గ్రూప్-1 ఫలితాల్లో సత్తాచాటాడు. 489.5 మార్కులతో రాష్ట్ర స్థాయిలో 86వ ర్యాంక్, జోనల్ స్థాయిలో Bc-E కేటగిరిలో మొదటి ర్యాంక్ సాధించాడు. తనకు డిప్యూటీ కలెక్టర్ వచ్చే అవకాశం ఉందని విలాయత్ తెలిపారు. దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన తాను.. తల్లితండ్రుల ప్రోత్సాహంతో గ్రూప్-1లో రాష్ర్టస్థాయిలో రానిచ్చినట్లు పేర్కొన్నాడు.