News November 5, 2025
రేపు వరంగల్ మార్కెట్ OPEN

వరంగల్ నగరంలోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ గురువారం ప్రారంభం కానుంది. నేడు కార్తీక పౌర్ణమి, గురునానక్ జయంతి సందర్భంగా మార్కెట్ బంద్ ఉంది. ఈ క్రమంలో మార్కెట్ రేపు ప్రారంభం అవుతుండగా… రైతులు నాణ్యమైన, తేమలేని పత్తిని సరుకులను మార్కెట్కు తీసుకొని వచ్చి మంచి ధర పొందాలని అధికారులు సూచించారు.
Similar News
News November 5, 2025
అనకాపల్లి జిల్లాలో టుడే టాప్ న్యూస్

➤ జిల్లాలో రెండు సబ్ స్టేషన్లు ప్రారంభించిన విద్యుత్ శాఖ మంత్రి
➤ భక్తిశ్రద్ధలతో కార్తీక నోములు
➤ మంగవరంలో ఏడుగురు పేకాట రాయుళ్లు అరెస్ట్
➤ విజయరామరాజుపేట తాచేరు వంతెనపై రవాణా పునరుద్ధరణ
➤ రాజీనామా చేసిన వైసీపీ నేతకు బుజ్జగింపులు
➤ అనకాపల్లిలో పర్యవేక్షక ఇంజినీర్ కార్యాలయ నిర్మాణానికి శంకుస్థాపన
➤ గర్నికం వద్ద కోళ్ల ఫారం తొలగించాలని గ్రామస్థుల ధర్నా
➤ ఆలయాల వద్ద పోలీసులు, అధికారుల పహారా
News November 5, 2025
జూబ్లీ సర్వేల వెనుక కేటీఆర్ కుట్ర: చనగాని దయాకర్

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కేటీఆర్ వెనుక ఉండి చేయిస్తున్న ఫేక్ సర్వేలతో ప్రజల అభిప్రాయం మారదని టీపీసీసీ జనరల్ సెక్రటరీ చనగాని దయాకర్ మండిపడ్డారు. ఉస్మానియా యూనివర్సిటీలో మాట్లాడుతూ.. ఫేక్ సర్వేలు పూర్తి ప్రజా అభిప్రాయం కాదన్నారు. సర్వేల వెనుక కేటీఆర్ కుట్ర ముమ్మాటికి ఉందని అందుకే సర్వేల ఆర్టిస్టులు బయటకు వచ్చారన్నారు. జూబ్లీహిల్స్ ప్రజలు ముమ్మాటికి అభివృద్ధిని కోరుకుంటున్నారన్నారు.
News November 5, 2025
ప్రతాపసింగారం: పంచవృక్షాల మహిమాన్వితం.. శైవక్షేత్రం

మేడ్చల్ జిల్లా ప్రతాపసింగారంలోని శివాలయం విశిష్టతతో భక్తుల మనసును ఆకట్టుకుంటోంది. కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు నిర్మించిన ఈ దేవాలయంలో రావి, మారేడు, వేప, ఉసిరి, జమ్మి పంచవృక్షాలు ఒకేస్థలంలో పెరిగాయి. ఈ 5 వృక్షాలు సాక్షాత్ దైవతత్త్వాన్ని ధారపోస్తూ ఆ ప్రదేశాన్ని పవిత్ర శక్తిక్షేత్రంగా మార్చేశాయి. ఆధ్యాత్మిక తేజస్సు విరజిమ్మే ఈ ప్రాంగణంలో కార్తీక మాసంలో దీపం వెలిగిస్తే శుభఫలాలు కలుగుతాయని భక్తుల నమ్మకం.


