News November 22, 2024

రేపు వాలంటీర్లు కలెక్టరేట్ ముట్టడి: డీవైఎఫ్ఐ

image

వాలంటీర్ల వ్యవస్థను కొనసాగించాలని శనివారం చేపట్టే కలెక్టరేట్ ముట్టడిని విజయవంతం చేయాలని డీవైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు సురేశ్ శుక్రవారంపిలుపునిచ్చారు. గతంలో కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలన్నారు. రూ.10,000 జీతం ఇస్తామన్న సీఎం చంద్రబాబు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలన్నారు. లేదంటే దశల వారీగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.

Similar News

News November 23, 2024

రోజా పూల తోటను పరిశీలించిన కలెక్టర్

image

మహానంది మండలం గాజులపల్లెలో రోజా పూల తోటను నంద్యాల కలెక్టర్ రాజకుమారి గణియా పరిశీలించారు. సాగు చేస్తున్న విధానాన్ని రైతులను అడిగి తెలుసుకున్నారు. పూల తోట చక్కగా ఉందని రైతును ప్రశంసించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించి అధిక దిగుబడులు సాధించి ఆర్థిక ప్రయోజనం పొందాలని కోరారు.

News November 22, 2024

నంద్యాల: మహిళా MLAల గ్రూప్ SELFIE

image

అసెంబ్లీ, మండలి సమావేశాలు ఈ నెల 11న ప్రారంభమై ఇవాళ నిరవధిక వాయిదా పడ్డాయి. కోవూరు MLA వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి జ‌న్మ‌దినం సంద‌ర్భంగా అసెంబ్లీ ప్రాంగణంలో మ‌హిళా MLAలు కేక్ క‌ట్ చేసి ప్ర‌శాంతిరెడ్డికి శుభాకాంక్ష‌లు తెలిపారు. వేడుక‌ల అనంత‌రం హోంమంత్రి అనిత‌ అంద‌రినీ త‌న ఫోన్‌తో సెల్ఫీ తీశారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. మన MLAలు భూమా అఖిలప్రియ, గౌరు చరితా పాల్గొన్నారు.

News November 22, 2024

పార్టీలో పనిచేసిన మరికొందరికి పదవుల కోసం కృషిచేస్తా: తిక్కారెడ్డి

image

టీడీపీలో పనిచేసిన మరికొందరికి ప్రభుత్వ పదవులు ఇప్పించేందుకు కృషిచేస్తానని కర్నూలు జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి తెలిపారు. శుక్రవారం టీడీపీ కార్యాలయంలో ప్రభుత్వ పదవులు పొందిన వారిని సన్మానించారు. కుడా ఛైర్మన్‌గా సోమిశెట్టి వెంకటేశ్వర్లు, కురువ ఫెడరేషన్ ఛైర్మన్‌గా దేవేంద్రప్ప, వాల్మీకి ఫెడరేషన్ ఛైర్ పర్సన్‌గా బొజ్జమ్మకు అవకాశం లభించిందన్నారు. కార్పొరేషన్లలో సభ్యులు మరికొందరికి వచ్చాయన్నారు.