News March 1, 2026
రేపు వికారాబాద్‌కు రాహుల్ గాంధీ రాక

అనంతగిరిలోని హరిత రిసార్ట్‌లో జరుగుతున్న తెలుగు రాష్ట్రాల డీసీసీల శిక్షణా తరగతులు రేపటితో ముగుస్తాయి. ఈ తరగతులకు ఈ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్‌గాంధీ రానున్నారు. జిల్లా అధ్యక్షులు తీసుకోవాల్సిన నిర్ణయాలపై దిశానిర్దేశం చేయనున్నారు. తెలంగాణ చీఫ్ మహేశ్ కుమార్, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ముఖ్య నేతలు హాజరవుతారని సమాచరం. దీనికోసం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.
Similar News
News March 1, 2026
BREAKING: US యుద్ధనౌకపై 4 మిస్సైళ్లతో ఇరాన్ దాడి

యుద్ధ విమానాలను తరలిస్తున్న అమెరికా నౌక అబ్రహం లింకన్‌పై ఇరాన్ దాడి చేసింది. 4 బాలిస్టిక్ మిస్సైళ్లతో అటాక్ చేసినట్లు IRGC ప్రకటించింది. అయితే యుద్ధ విమానాలకు ఏ మేరకు నష్టం జరిగిందనే దానిపై క్లారిటీ ఇవ్వలేదు. యుద్ధం నేపథ్యంలో ఇరాన్ చుట్టుపక్కల ఉన్న ఎయిర్ బేస్‌లకు వాటిని తరలిస్తుండగా ఘటన జరిగినట్లు తెలుస్తోంది. దీనికి ప్రతిగా ఇరాన్‌పై US దాడులు మరింతగా పెంచే ఆస్కారముంది.
News March 1, 2026
జగిత్యాల: ఆర్ఎస్ఎస్ మహాసాంఘిక్ కార్యక్రమం

వ్యక్తి నిర్మాణం ద్వారానే దేశ పునర్నిర్మాణం సాధ్యమని ఆర్ఎస్ఎస్ తెలంగాణ ప్రాంత సహ వ్యవస్థ ప్రముఖ్ గంట తిరుమల్ జీ అన్నారు. ఆర్ఎస్ఎస్ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా జగిత్యాల పట్టణంలో నగర మహాసాంఘిక్ నిర్వహించారు. 23 శాఖలకు చెందిన సుమారు 500 మంది స్వయంసేవకులు పాల్గొన్నారు. నిత్య శాఖ ద్వారా వ్యక్తిత్వ వికాసం జరుగుతుందని, శక్తివంతమైన భారతదేశంతోనే ప్రపంచశాంతి సాధ్యమని పేర్కొన్నారు.
News March 1, 2026
కర్నూలు జిల్లా ప్రజలకు ఎస్పీ హెచ్చరిక

ఆన్‌లైన్ షాపింగ్ పేరుతో ప్రజలను మోసం చేస్తున్న నకిలీ వెబ్‌సైట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ సూచించారు. ప్రముఖ కంపెనీల పేర్లను పోలి ఉండే వెబ్‌సైట్లను సృష్టించి, భారీ డిస్కౌంట్ల పేరుతో ముందస్తు చెల్లింపులు తీసుకుని వస్తువులు పంపకుండా కేటుగాళ్లు మోసం చేస్తున్నారన్నారు. సైబర్ నేరాలకు గురైతే వెంటనే 1930 నంబర్‌కు ఫిర్యాదు చేయాలన్నారు.


