News August 5, 2024
రేపు విజయవాడకు మాజీ సీఎం జగన్

మాజీ సీఎం జగన్ రేపు విజయవాడకు రానున్నారు. బెంగళూరు నుంచి ఆయన మధ్యాహ్నం 2:25 గంటలకు బయలుదేరి 3.45గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకోనున్నారు. 4 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గన విజయవాడ మొగల్రాజపురంలోని సన్రైజ్ హాస్పిటల్‌కు చేరుకుంటారు. అక్కడ ఆదివారం గాయపడిన వైసీపీ నేత శ్రీనివాసరావును జగన్ పరామర్శించనున్నారు. అనంతరం తాడేపల్లి స్వగృహానికి చేరుకుంటారు.
Similar News
News February 22, 2026
గుడివాడ: ఫీజు రాయితీపై ప్రైవేట్ స్కూళ్ల మొండికేత

ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా జర్నలిస్టుల పిల్లలకు స్కూల్ ఫీజుల్లో 50% రాయితీ కల్పిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసినప్పటికీ, గుడివాడలోని కొన్ని ప్రైవేట్ స్కూళ్లు వీటిని బేఖాతరు చేస్తున్నాయి. మాకు ఆ జీవోల గురించి తెలియదు అంటూ యాజమాన్యాలు తప్పించుకుంటున్నాయని జర్నలిస్టులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. MEO పలుమార్లు సూచించినా, స్కూళ్లలో విద్యార్థులను ఫీజుల కోసం వేధిస్తూనే ఉన్నారని ఆరోపిస్తున్నారు.
News February 22, 2026
కృష్ణా: ఈ మాస్టారు రూటే సెపరేటు..!

కోడూరు మండలం ఉల్లిపాలెం ప్రభుత్వ పాఠశాలలో సైన్స్ ఉపాధ్యాయుడు వినూత్న బోధనతో ఆకట్టుకుంటున్నారు. పుస్తకాలకే పరిమితం కాకుండా, విద్యార్థులను నేరుగా ప్రకృతిలోకి తీసుకెళ్లి పాఠాలు చెబుతున్నారు. చేపల సాగు, మడ అడవుల సంరక్షణ, వ్యవసాయ పద్ధతులపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పిస్తున్నారు. ఈ ప్రాక్టికల్ లెర్నింగ్ ద్వారా విద్యార్థులు సైన్స్ అంశాలను ఎంతో సులభంగా అర్థం చేసుకుంటున్నారు.
News February 22, 2026
గుడివాడ: రైలులో మర్చిపోయిన రూ.14 లక్షల సొత్తు అప్పగింత

విశాఖ నుంచి మచిలీపట్నం వెళ్తున్న రైలులో వరలక్ష్మి అనే మహిళ తన హ్యాండ్‌బ్యాగ్‌ను మర్చిపోయి భీమవరం టౌన్‌లో దిగిపోయారు. బాధితురాలి సమాచారంతో గుడివాడ రైల్వే ఎస్సై మహబూబ్ షరీఫ్ సిబ్బందితో కలిసి వెంటనే అప్రమత్తమయ్యారు. రైలు గుడివాడ రాగానే తనిఖీలు చేసి బ్యాగును స్వాధీనం చేసుకున్నారు. అందులోని 110 గ్రాముల బంగారం, రూ. 5వేల నగదు, మొబైల్ ఫోన్‌ను (మొత్తం విలువ రూ.14 లక్షలు) పోలీసులు బాధితురాలికి అందజేశారు.


