News November 10, 2024
రేపు విజయవాడకు సీఎం చంద్రబాబు
భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జన్మదినం సందర్భంగా రేపు సోమవారం విజయవాడలో మైనార్టీ సంక్షేమ దినోత్సవాన్ని నిర్వహించనున్నారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగే ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరవుతారని ఉర్దూ అకాడమీ డైరెక్టర్ మస్తాన్ వలీ తెలిపారు. కార్యక్రమంలో ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసినవారికి, పలువురు విద్యార్థులు, ఉపాధ్యాయులకు అవార్డులను ప్రదానం చేస్తామన్నారు.
Similar News
News November 13, 2024
60 ఏళ్ల వయస్సులో బంగారు పతకాల పంట
కృష్ణా జిల్లా పెడనకు చెందిన భీమేశ్వరరావు(60) జగ్గయ్యపేటలో 10వ తారీఖున జరిగిన రాష్ట్రస్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలలో 3 బంగారు పథకాలు సాధించారు. దీంతో ఈ వయసులో కూడా అతని ఫిట్నెస్ చూసి జనం ఆశ్చర్యపోయారు. క్రమం తప్పకుండా వ్యాయామం చేసే భీమేశ్వరరావు పాల్గొన్న ప్రతి పోటీల్లో పతకం సాధించడం విశేషం. ఇప్పటి వరకు జిల్లా రాష్ట్ర స్థాయి పోటీల్లో 14 పతకాలను గెలిచాడు. ఈ ఘనతకు కారణం కోచ్ సుబ్రహ్మణ్యం అని చెప్పారు.
News November 13, 2024
కృష్ణా: నేటితో ముగియనున్న ఉద్యోగాల దరఖాస్తు గడువు
కృష్ణా: APCRDAలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన 19 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ నేటితో ముగియనుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా GIS & రిమోట్ సెన్సింగ్ అసిస్టెంట్(6), హెల్త్ & సేఫ్టీ స్పెషలిస్ట్(4) తదితర ఉద్యోగాలను APCRDA భర్తీ చేయనుంది. అభ్యర్థులు నోటిఫికేషన్‌కు సంబంధించిన వివరాలు, అప్లై చేసేందుకు https://crda.ap.gov.in/Careers/General అధికారిక వెబ్సైట్ చూడవచ్చు.
News November 12, 2024
అసెంబ్లీ విప్‌లుగా బోండా ఉమ, యార్లగడ్డ, తంగిరాల సౌమ్య
శాసన సభ, శాసనమండలి చీఫ్ విప్, విప్‌లను కాసేపటి క్రితం ప్రభుత్వం ఖరారు చేసింది. ఇద్దరు చీఫ్ విప్‌లతో పాటు 15 మందిని విప్‌లుగా నియమించింది. శాసన సభ చీఫ్ విప్‌గా ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, శాసన మండలి చీఫ్ విప్‌గా పంచుమర్తి అనురాధ నియమితులయ్యారు. ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి బోండా ఉమ(విజయవాడ సెంట్రల్), తంగిరాల సౌమ్య(నందిగామ), యార్లగడ్డ వెంకట్రావు(గన్నవరం) అసెంబ్లీ విప్‌లుగా అవకాశం లభించింది.