News September 1, 2024

రేపు విద్యా సంస్థలకు సెలవు: తిరుపతి కలెక్టర్ 

image

తిరుపతి జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కళాశాలకు సోమవారం సెలవు ప్రకటిస్తున్నట్లు కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

Similar News

News January 10, 2025

తిరుమల: భక్తులకు క్షమాపణ చెప్పిన టీటీడీ ఛైర్మన్

image

తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనలో తమ తప్పులేకపోయినా భక్తులందరికీ బేషరతుగా క్షమాపణలు చెబుతున్నట్టు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి బాధ్యులను ఉపేక్షించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అంతకు ముందు మీడియాతో మాట్లాడుతూ..క్షమాపణ చెప్పడంలో తప్పులేదు. క్షమాపణ చెప్పినంత మాత్రాన చనిపోయిన వాళ్లు తిరిగిరారు.ఎవరో ఏదో మాట్లాడారని స్పందించాల్సిన అవసరం లేదు అని వ్యాఖ్యానించారు.

News January 10, 2025

కొండంత జనం

image

తిరుమలలో శుక్రవారం వేకువజాము నుంచే వైకుంఠ ఏకాదశి వేడుకలు వైభవంగా ప్రారంభం అయ్యాయి. లక్షల సంఖ్యలో వచ్చిన భక్తులతో శ్రీవారి ఆలయ పరిసరాలు కిక్కిరిశాయి. వీఐపీలతో పాటూ సాధారణ భక్తులు తిరుమల వేంకన్నను ఉత్తర ద్వారం నుంచి దర్శనం చేసుకున్నారు. నారాయణుడి నామస్మరణతో తిరుమల ప్రాంగణం మార్మోగింది. స్వామి వారి స్వర్ణ రథోత్సవం సందర్భంగా తీసిన ఫొటోలు అబ్బుర పరుస్తున్నాయి.

News January 10, 2025

ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించండి

image

గురువారం నగరపాలక సంస్థ పరిధిలో 49వ వార్డు సచివాలయాన్ని అనంతపురం రీజినల్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పి.విశ్వనాథ్ తనిఖీ చేశారు. వార్డు పరిధిలో పన్నుల వసూళ్లపై సమీక్షించారు. వార్డు సచివాలయంలో కార్యదర్శులు హాజరు నమోదు, మూవ్మెంట్ రిజిస్టర్, పబ్లిక్ సర్వీసెస్ రిజిస్టర్లను తనిఖీ చేశారు. వార్డు సచివాలయానికి వచ్చే ప్రజలతో సామరస్యంగా మాట్లాడి వారి సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు.