News October 15, 2025

రేపు శ్రీశైలం వెళ్లే భక్తులకు ముఖ్య గమనిక

image

నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలంలోని మన్ననూరు గ్రామం మీదుగా శ్రీశైలం వెళ్లే భక్తులకు రేపు ఉదయం 9 గంటల నుంచి 2 గంటల వరకు వాహనాల రాకపోకలు నిలిపివేస్తూ ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు అధికారులు తెలిపారు. రేపు శ్రీశైలంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. భక్తులు తమ ప్రయాణాలు రేపు మధ్యాహ్నం తర్వాత ఏర్పాటు చేసుకోవాలని అధికారులు సూచించారు.

Similar News

News October 17, 2025

శుభ సమయం (17-10-2025) శుక్రవారం

image

✒ తిథి: బహుళ ఏకాదశి మ.1.08 వరకు
✒ నక్షత్రం: మఖ సా.4.38 వరకు
✒ శుభ సమయం: ఉ.10.00-10.30
✒ రాహుకాలం: ఉ.10.30-మ.12.00
✒ దుర్ముహూర్తం: ఉ.8.24-ఉ.9.12, మ.12.24-మ.1.12
✒ వర్జ్యం: శే.ఉ.6.08 వరకు, రా.12.52-2.30
✒ అమృత ఘడియలు: మ.3.00-మ.4.36 * ప్రతిరోజూ పంచాంగం, <<-1>>రాశిఫలాలు<<>> కోసం క్లిక్ చేయండి.

News October 17, 2025

సిద్దిపేట: ఇబ్బందులు లేకుండా కొనుగోలు చేయండి: కలెక్టర్

image

ఖరీఫ్ 2025-26 సీజన్ వరిధాన్యం సులభంగా రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు ప్రక్రియ జరిగేలా మిల్లర్లు, అధికారులు పనిచేయాలని కలెక్టర్ కె.హైమావతి ఆదేశించారు. గురువారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని సమావేశ మందిరంలో రైస్ మిల్లర్ అసోసియేషన్ ప్రతినిధులు, జిల్లా సివిల్ సప్లై, డీఆర్డీఓ అధికారులులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు.

News October 17, 2025

ఖమ్మం: ఎకరం భూమి ఇస్తే.. 300 గజాలు ప్లాట్

image

TTD ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లాలో నిర్వహిస్తున్న వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి రైతులు సహకరించాలని
ఖమ్మం అర్బన్ MRO దొడ్డారపు సైదులు కోరారు. అల్లీపురం, కొత్తగూడెం ప్రాంతాలలోని అసైన్డ్ భూములు కలిగిన రైతులు తమ భూములు ఇవ్వాలని కోరారు. ఒక్క ఎకరా భూమిని ఆలయ అభివృద్ధి కేటాయిస్తే 300 గజాల ప్లాట్‌ను అభివృద్ధి చేసి రైతులకు అందజేస్తామని వివరించారు.