News February 23, 2025
రేపు శ్రీశైలానికి ఏపీ గవర్నర్ రాక

శివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ సోమవారం శ్రీశైలం రానున్నారు. గత నెల 17న శ్రీశైల దేవస్థానం ఈవో శ్రీనివాసరావు గవర్నర్‌ని కలిసి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించారు. ఈ మేరకు గవర్నర్ శ్రీశైలం పర్యటన ఖరారైంది. 24న ప్రత్యేక హెలికాప్టర్లో గవర్నర్ సుండిపెంట చేరుకొని అక్కడి నుంచి రోడ్డు మార్గాన శ్రీశైలం చేరుకుంటారు. రాత్రి అక్కడే బస చేసి 25న తిరిగి వెళ్తారు.
Similar News
News February 23, 2025
HYD: SLBC ప్రమాదం.. BRS సర్కార్ నిర్లక్ష్యం: చాడ

SLBC వద్ద జరిగిన ప్రమాదంలో అనేక పరిణామాలు ఉన్నాయని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి అన్నారు. SLBC ప్రపంచంలోనే అతిపెద్ద సొరంగ మార్గమని, 20సార్లు మార్పులు చేయడం వల్ల సొరంగ మార్గం అంచనాలు పెరిగి మరింత ఆలస్యం జరిగిందని కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వ కాలంలో పనులు చేపట్టకపోవడంపై కప్పు స్లాబ్ తుప్పు పట్టి ఈ ప్రమాదం జరిగిందన్నారు. ఇది గత ప్రభుత్వ నిర్లక్ష్యమన్నారు.
News February 23, 2025
టాసుల్లో టీమ్ ఇండియా ఓటముల పరంపర

టీమ్ ఇండియా టాసుల ఓటముల పరంపర కొనసాగుతోంది. పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచులోనూ టాస్ ఓడింది. రోహిత్ ‘హెడ్స్’ అనగానే కాయిన్ రివర్స్‌లో పడింది. దీంతో వన్డేల్లో వరుసగా 12వ మ్యాచులోనూ భారత్ టాస్ పరాభవం ఎదుర్కొంది. ఈ క్రమంలో నెదర్లాండ్స్(11 టాస్ ఓటములు)ను భారత్ అధిగమించింది. ఇండియన్ టీమ్ 2023 వన్డే వరల్డ్ కప్ నుంచి ఇప్పటివరకు 12 సార్లు టాస్ గెలవలేకపోయింది.
News February 23, 2025
అమెరికా రాజకీయాల్లో తణుకు యువకుడు

అమెరికా రాజకీయాల్లో తణుకుకి చెందిన యువకుడు సత్తి ఆదిత్యరెడ్డి కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇటీవల హోరా హోరీగా జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ క్యాంపైన్ బృందంలో ఆయన కీలక బాధ్యతలు నిర్వర్తించారు. అంతకు ముందు ఆర్మీ నేషనల్ గార్డ్‌గా పనిచేసిన ఆయన రిపబ్లిక్ పార్టీలో, ట్రంప్ ప్రభుత్వంలో అధికారిక హోదా పొందబోతున్నారు. వైట్ హౌస్‌లో జరిగే దాదాపు అన్ని కార్యక్రమాలకు ఆయన ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తున్నారు.