News December 13, 2025
రేపు సూర్యపేట జిల్లాలో కేటీఆర్ పర్యటన

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదివారం సూర్యాపేట జిల్లాలో పర్యటించనున్నారు. నూతనకల్ మండలం లింగంపల్లిలో కాంగ్రెస్ నాయకులు చేతిలో ఇటీవల హత్యకు గురైన బీఆర్ఎస్ నాయకుడు ఉప్పల మల్లయ్య కుటుంబాన్ని మాజీ మంత్రి కేటీఆర్, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మల్లయ్య కుటుంబాన్ని పరామర్శించనున్నారు.
Similar News
News December 15, 2025
పోలింగ్ కేంద్రాల వద్ద ఎలక్ట్రానిక్స్‌కు నో: సీపీ

సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో జరగనున్న మూడవ విడత ఎన్నికల నేపథ్యంలో పోలీస్ కమిషనర్ విజయ్ కుమార్ కీలక ఆదేశాలు జారీ చేశారు. పోలింగ్ కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో మొబైల్ ఫోన్లు, కార్డులెస్ ఫోన్లు, వైర్‌లెస్ సెట్లు లేదా ఎలాంటి ఎలక్ట్రానిక్ డివైజ్‌లకు కూడా అనుమతి లేదని స్పష్టం చేశారు. నిబంధనలను అతిక్రమిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు.
News December 15, 2025
మిరుదొడ్డి: ఆటో డ్రైవర్ నుంచి ఉపసర్పంచ్‌గా..

కుటుంబ పోషణ కోసం చిన్న వయసులోనే ఆటో డ్రైవర్‌గా మారిన యువకుడు నేడు ఉపసర్పంచ్‌గా ఎన్నికై ఆదర్శంగా నిలిచారు. మిరుదొడ్డి మండలం కొండాపూర్ ఉపసర్పంచ్‌గా 23 ఏళ్ల సోమగల్ల భాస్కర్ ఎన్నికయ్యారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో 10వ వార్డు నుంచి భారీ మెజారిటీతో గెలుపొందిన భాస్కర్ అనంతరం ఉపసర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గ్రామాభివృద్ధికి కృషి చేస్తానని, గ్రామస్థులకు నిత్యం అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు.
News December 15, 2025
ప్రతి అంశంలో కానిస్టేబుళ్లు కీలకం: చిత్తూరు SP

ప్రజా భద్రత కోసం నూతనంగా ఎంపికైన కానిస్టేబుళ్లు అహర్నిశలు పనిచేయాలని చిత్తూరు ఎస్పీ తుషార్ డూడీ సూచించారు. విజయవాడలో నియామక పత్రాలు స్వీకరించనున్న 196 మంది అభ్యర్థులతో జిల్లా పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో సోమవారం ఆయన సమావేశం నిర్వహించారు. క్షేత్రస్థాయిలో కానిస్టేబుళ్లు చేసే కృషి మీదే శాంతి భద్రతల నిర్వహణ ఆధారపడి ఉంటుందన్నారు. ప్రతి అంశంలోనూ కానిస్టేబుల్ పాత్ర కీలకమన్నారు.


