News December 1, 2025

రేపు స్కూళ్లకు సెలవు ఉందా?

image

AP: దిత్వా తుఫాను హెచ్చరికల నేపథ్యంలో ఇవాళ తిరుపతి, కడప, నెల్లూరు, అన్నమయ్య జిల్లాల్లోని స్కూళ్లు, కాలేజీలకు సెలవులిచ్చారు. అయితే తుఫాను బలహీనపడటంతో రేపటికి ఎలాంటి సెలవు ప్రకటనలు వెలువడలేదు. దీంతో యథావిధిగా విద్యాసంస్థలు కొనసాగనున్నాయి. తమిళనాడులో భారీ వర్షాలు కొనసాగుతుండటంతో చెన్నై, తిరువళ్లూరు, చెంగల్పట్టు జిల్లాల్లో స్కూళ్లకు సెలవు ప్రకటించారు. పలు యూనివర్సిటీల పరీక్షలను వాయిదా వేశారు.

Similar News

News April 5, 2026

ఆ ఏనుగు ఫిబ్రవరిలోనే చనిపోయింది!

image

జైపూర్‌లో ఓ ఏనుగుకు ఒళ్లంతా పింక్ కలర్ వేసి ఫొటోషూట్ చేయడం ఇటీవల వివాదాస్పదమైన విషయం తెలిసిందే. అయితే, ఆ ఘటన ఏడాది క్రితం జరిగినట్లు తాజాగా తేలింది. దాదాపు 67 ఏళ్ల వయసున్న చంచల్ అనే ఆ ఏనుగు ఫిబ్రవరిలోనే కార్డియాక్ అరెస్ట్‌తో మరణించినట్లు డాక్టర్లు ధ్రువీకరించారని NDTV పేర్కొంది. వృద్ధాప్యం వల్లే చనిపోయిందని, కలర్‌తో ఎలాంటి సంబంధం లేదని స్థానికులు తెలిపారు.

News April 5, 2026

ఏప్రిల్ 10 నుంచి టోల్ గేట్ల వద్ద ‘క్యాష్’ బంద్: కొత్త రూల్స్ ఇవే!

image

ఏప్రిల్ 10 నుంచి టోల్ ప్లాజాల వద్ద నగదు చెల్లింపులు పూర్తిగా రద్దు కానున్నాయి. FASTag లేదా UPI ద్వారానే పేమెంట్స్ చేయాలి. UPIతో చేస్తే 1.25 రెట్లు ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. ఈ రెండు ఆప్షన్లు పని చేయకపోతే వాహనదారుడికి ‘ఈ-నోటీస్’ వస్తుంది. 72 గంటల్లోపు ఆన్‌లైన్‌లో చెల్లిస్తే అదనపు ఫీజు ఉండదు. ఆ తర్వాత అయితే డబుల్ టోల్ కట్టాలి. 15 రోజులు దాటితే VAHAN సిస్టమ్ ద్వారా కఠిన చర్యలు తప్పవు.

News April 5, 2026

కరెంట్ అఫైర్స్ (05-04-2026)

image

⋆ బ్యాంకాక్‌లో జరిగిన వరల్డ్ ఆర్చరీ పారా సిరీస్‌లో భారత ఆర్చర్ పాయల్ నాగ్‌కు గోల్డ్ మెడల్
⋆ ఆరో తరగతి నుంచి 3 భాషల విధానం.. 2026-27 విద్యా సంవత్సరం నుంచే అమలు: CBSE
⋆ నాసా ఆర్టెమిస్-2 ప్రయోగం.. 1972 తర్వాత తొలిసారిగా చంద్రుడి కక్ష్యలోకి మనుషులు
⋆ ప్రపంచంలో అత్యంత బరువైన (7 టన్నులు) కార్గో డ్రోన్(Changying-8 లేదా CY-8)ను పరీక్షించిన చైనా.. దీని రేంజ్ 1,850మైళ్లు (2,977kms)