News January 29, 2026
రేపు హనుమకొండ జిల్లాలో విద్యాసంస్థలకు సెలవు

మేడారం మహాజాతరను పురస్కరించుకుని ఈనెల 30న శుక్రవారం హనుమకొండ జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తూ కలెక్టర్ స్నేహ శబరీష్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సెలవుకు బదులుగా ఫిబ్రవరి 14వ తేదీని (రెండో శనివారం) పనిదినంగా పరిగణించనున్నట్లు ఆమె స్పష్టం చేశారు. జిల్లాలోని అన్ని పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలు ఈ ఆదేశాలను పాటించాలని కలెక్టర్ సూచించారు.
Similar News
News February 19, 2026
అమరావతిలో మిగిలిన భూముల సేకరణ

అమరావతి రాజధానిలో ల్యాండ్ పూలింగ్‌కు ఇవ్వని భూములను భూసేకరణ చట్టం ద్వారా తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇంకా 2,459 ఎకరాల భూమి పూలింగ్‌కు రాలేదు. అయతే భూసేకరణ నోటిఫికేషన్ విడుదలకు ముందే రైతులు ముందుకొస్తే, వారికి ల్యాండ్ పూలింగ్ ఆప్షన్ అందుబాటులో ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
News February 19, 2026
పట్టిసీమ భద్రకాళి వీరేశ్వర స్వామిని దర్శించిన శేఖర్ మాస్టర్

పోలవరం పట్టిసీమ శ్రీ భద్రకాళి వీరేశ్వర స్వామిని సినీ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ బుధవారం దర్శించుకున్నారు. ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారికి అర్చనలు చేసి ఆశీర్వాదాలు పొందారు. శేఖర్ మాస్టర్ కుటుంబ సభ్యులతో వచ్చి స్వామివారి దర్శనం చేసుకున్నారు. విషయం తెలుసుకున్న అభిమానులు పెద్ద సంఖ్యలో చేరుకుని ఆయనతో సెల్ఫీలు దిగారు.
News February 19, 2026
కర్నూలు: ప్రేమ విషయమై గొడవ.. బలవన్మరణం

ఆదోని అరుణ్ జ్యోతి నగర్ కాలనీకి చెందిన మహేశ్(20) బలవన్మరణానికి పాల్పడిన విషయం తెలిసిందే. ‘మహేశ్ బేల్దారి పనిచేస్తూ జీవనం సాగించేవాడు. ఈ క్రమంలో ఓ యువతిని ప్రేమించాడు. తననే పెళ్లి చేసుకుంటానని ఇంట్లో చెప్పడంతో ఈ విషయమై గొడవ జరిగింది. దీంతో క్షణికావేశానికి లోనై మేడపై ఇంట్లో ఉరేసుకొన్నాడు. ఆదోని ప్రభుత్వాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు’ అని మూడో పట్టణ ఎస్ఐ రామస్వామి తెలిపారు.


