News January 22, 2025
రేపు హుస్నాబాద్‌లో మంత్రి పొన్నం పర్యటన

హుస్నాబాద్: పట్టణ అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా మంత్రి పొన్నం ప్రభాకర్ గురువారం హుస్నాబాద్‌లో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. ఈ మేరకు పట్టణంలోని 15వ వార్డులో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేసి హనుమాన్ గుడి సమీపంలో వార్డు సభలో పాల్గొననున్నారు. 2వ వార్డులో పోచమ్మ కమాన్ ప్రారంభించనున్నారు.
Similar News
News July 4, 2025
కోనరావుపేట: ‘జీవితంలో విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకోవాలి’

జీవితంలో విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకోవాలని హోంశాఖ సహాయ మంత్రి వర్యులు బండి సంజయ్ అన్నారు. శుక్రవారం కోనరావుపేట మండలం మర్రిమడ్ల గ్రామంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్‌లో రూ. 5 కోట్ల 14 లక్షలతో చేపట్టిన అదనపు మౌలిక వసతుల నిర్మాణం పనులకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝాతో కలిసి శంకుస్థాపన, భూమి పూజ చేశారు.
News July 4, 2025
వారసత్వ భూములకు సెక్షన్ సర్టిఫికెట్లు: చంద్రబాబు

AP: రెవెన్యూ శాఖపై సమీక్షలో సీఎం చంద్రబాబు పేదల భూసమస్యలపై పలు నిర్ణయాలు తీసుకున్నారు. రూ.10 లక్షల విలువైన వారసత్వ భూములకు సచివాలయంలో రూ.100 చెల్లించి, రూ.10 లక్షలు దాటిన భూములకు రూ.1,000 చెల్లించి సెక్షన్ సర్టిఫికెట్లు పొందవచ్చని తెలిపారు. అలాగే ఫ్రీహోల్డ్ భూముల సమస్యలను OCT 2లోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఫ్రీహోల్డ్ భూముల అంశంలో పేదలకు లబ్ధి జరిగేలా చూడాలని సీఎం సూచించారు.
News July 4, 2025
NLG: ‘కొమురయ్య పోరాట పటిమ ఆదర్శప్రాయం’

తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమరయ్య వర్ధంతిని సీపీఎం నేతలు నల్గొండ పట్టణంలోని దొడ్డి కొమురయ్య భవనంలో శుక్రవారం నిర్వహించారు. కొమురయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పార్టీ జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి మాట్లాడారు. ఆయన పోరాట పటిమ అందరికీ ఆదర్శప్రాయమన్నారు. భూమికోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం ఆయన జరిపిన పోరాటం స్ఫూర్తిదాయకమని కొనియాడారు.