News January 27, 2026

రేపు JEE మెయిన్… ఈ జాగ్రత్తలు తప్పనిసరి

image

రేపు, ఎల్లుండి JEE మెయిన్ పరీక్షలు జరుగనున్నాయి. దేశవ్యాప్తంగా 15L మంది వరకు వీటికి హాజరుకానున్నారు. ఉ.9-12 వరకు ఫస్ట్ సెషన్, మ.3-6 వరకు రెండో సెషన్ ఉంటుంది. APలో 30, TGలో 14 పట్టణాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటుచేశారు. కాగా అభ్యర్థులు తమతో పాటు అడ్మిట్ కార్డు, సెల్ఫ్ డిక్లరేషన్, పాస్‌పోర్టు సైజ్ ఫొటో, ఒరిజినల్ స్కూల్ ఐడీ లేదా ఇతర ఫొటో IDని తీసుకెళ్లాలి. NTA నిషేధిత వస్తువుల్ని తీసుకుపోరాదు.

Similar News

News February 17, 2026

బంగ్లా ప్రధానిగా తారిఖ్ ప్రమాణం.. భేటీ అయిన ఓం బిర్లా

image

బంగ్లాదేశ్ నూతన ప్రధానిగా BNP చీఫ్ తారిఖ్ రెహ్మాన్ ఢాకాలో ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి భారత్ నుంచి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా హాజరయ్యారు. ప్రమాణస్వీకారానికి ముందు తారిఖ్‌తో బిర్లా ప్రత్యేకంగా సమావేశమై భారత్ తరఫున శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 297 సీట్లకు గాను ఆ పార్టీ 209 చోట్ల గెలిచిన విషయం తెలిసిందే.

News February 17, 2026

రూ.10 కోట్లు చెల్లించాల్సిందే.. విశాల్‌కు కోర్టు ఆదేశం

image

ప్రముఖ హీరో విశాల్‌కు మద్రాస్ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. లైకా ప్రొడక్షన్స్‌కు వెంటనే రూ.10 కోట్లు డిపాజిట్ చేయాలని ఆదేశించింది. ఇందుకు ఆరు వారాల సమయం కావాలంటూ హీరో మరో పిటిషన్ దాఖలు చేయగా న్యాయస్థానం కొట్టేసింది. గడువు ఇచ్చేందుకు నిరాకరించింది. కాగా సినిమా తీస్తానని విశాల్ తమ వద్ద రూ.21.29 కోట్లు అప్పుగా తీసుకుని తిరిగి ఇవ్వలేదంటూ లైకా 2022లో మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది.

News February 17, 2026

దారుణం.. రైలులో యువతిపై TTE అత్యాచారం

image

అహ్మదాబాద్-గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌లో దారుణం జరిగింది. NCC క్యాడెట్ పరీక్ష రాసి వెళ్తున్న యువతిపై TTE రాహుల్ అత్యాచారం చేశాడు. రద్దీ ఎక్కువ ఉండటంతో ఆమె టికెట్ తీసుకోకుండా ఏసీ కోచ్ ఎక్కింది. సీటు ఇప్పిస్తానని చెప్పి TTE క్యాబిన్‌కు తీసుకెళ్లి రేప్ చేశాడు. ఆ తర్వాత బాధితురాలు 112కు ఫోన్ చేయడంతో నిందితుడు డియోరియా స్టేషన్‌లో దిగి పారిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు.