News January 11, 2026
రేపు PSLV-C62 ప్రయోగం

AP: ISRO మరో చారిత్రక ప్రయోగానికి సిద్ధమవుతోంది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్-షార్ నుంచి రేపు ఉదయం 10.17 గంటలకు PSLV-C62 రాకెట్‌ను ప్రయోగించనుంది. దీని ద్వారా అధునాతన భూపరిశీలన ఉపగ్రహం EOS-N1తో పాటు మరో 15 చిన్న ఉపగ్రహాలను రోదసిలోకి పంపనుంది. కొత్త ఏడాదిలో ISROకు ఇదే తొలి ప్రయోగం. దీనికి సంబంధించిన కౌంట్‌డౌన్ ఈరోజు మధ్యాహ్నం 12.17 గంటలకు ప్రారంభించనున్నారు.
Similar News
News March 31, 2026
రేపటి నుంచి జరిగే మార్పులివే!

☛ ఇకపై OTPతో డిజిటల్ చెల్లింపులు చేయలేం. ప్రతి ట్రాన్సాక్షన్‌కి PIN/Password, రిజిస్టర్డ్ డివైజ్, ఫింగర్ ప్రింట్, ఫేస్ ఐడీ వంటివి ఏవైనా 2 కావాలి.
☛ దేశంలోని అన్ని పెట్రోల్ బంకుల్లో E20 పెట్రోల్ తప్పనిసరి.
☛ KYC చేయని ఫాస్ట్‌ట్యాగ్ అకౌంట్లు బ్లాక్ అవుతాయి.
☛ కొన్ని బ్యాంకులు డెబిట్ కార్డు నిర్వహణ ఛార్జీలను పెంచాయి.
☛ ఇక నుంచి అన్ని కొత్త బీమా పాలసీలను తప్పనిసరిగా ఎలక్ట్రానిక్ రూపంలోనే జారీ చేయాలి.
News March 31, 2026
నోట్‌బుక్ సెలబ్రేషన్స్.. ఈసారీ తగ్గేదేలే: దిగ్వేశ్ రాఠీ

గతేడాది IPLలో నోట్‌బుక్ సెలబ్రేషన్స్‌తో వార్తల్లో నిలిచిన LSG స్పిన్నర్ దిగ్వేశ్ రాఠీ గుర్తున్నారా? ఈ సీజన్‌లోనూ తన తీరును మార్చుకొనేది లేదని ఆయన స్పష్టం చేశారు. ‘నేనెవరినీ అవమానించడం లేదు. బ్యాటర్ సెంచరీ చేశాక హెల్మెట్‌ను బ్యాట్‌పై పెట్టుకొని సెలబ్రేట్ చేసుకొంటారు. నేనూ ఇంతే. నన్నెవరూ ఆపలేరు. కెప్టెన్ రిషభ్ సపోర్ట్ నాకుంది. బ్యాన్ పడకుండా చూసుకోమని మాత్రమే ఆయన సూచించారు’ అని పేర్కొన్నారు.
News March 31, 2026
విమాన ఇంధనంపై వ్యాట్ తగ్గించండి.. రాష్ట్రాలకు లేఖ!

పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్(ATF) ధర బ్యారెల్ $99.40 నుంచి $195.19కి చేరింది. కంపెనీలు రేపు ఈ రేట్లను మరోసారి సవరించనున్నాయి. ఈ నేపథ్యంలో విమాన ఇంధనంపై వ్యాట్‌ను తగ్గించాలని కేంద్ర మంత్రి రామ్మోహన్ రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాసినట్లు సమాచారం. ‘ఢిల్లీలో VAT 25%, మహారాష్ట్రలో 18%, TNలో 29% ఉంది. వీటిని తగ్గిస్తే విమాన టికెట్లపై భారం పడదు’ అని పేర్కొన్నట్లు తెలుస్తోంది.


