News August 10, 2025
రేపే చిత్తూరుకు బీజేపీ అధ్యక్షుడి రాక

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ చిత్తూరులో సోమవారం పర్యటించనున్నట్లు ఆ పార్టీ నాయకులు ఓ ప్రకటనలో తెలిపారు. ఆ రోజు ఉదయం 8 గంటలకు మిట్టూరులో ఛాయ్ పే చర్చ, 10 గంటలకు కట్టమంచి రామలింగారెడ్డి విగ్రహానికి నివాళి, అనంతరం వివేకానంద విగ్రహం నుంచి తిరంగా ర్యాలీ నిర్వహిస్తారు. మధ్యాహ్నం 12గంటలకు నాయకులతో, సాయంత్రం 4గంటలకు మీడియా, మేధావులతో సమావేశం నిర్వహిస్తారు.
Similar News
News August 12, 2025
CTR: మూడుకు చేరిన మృతుల సంఖ్య

పళ్లిపట్టు వద్ద మంగళవారం జరిగిన ఘోర ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగింది. GDనెల్లూరు(M) గోవిందరెడ్డిపల్లికి చెందిన YCP నాయకుడు సురేంద్ర రెడ్డి కుటుంబంతో కలిసి కావడి మొక్కులు చెల్లించేందుకు తిరుత్తణికి కారులో బయల్దేరారు. అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో వాహనం బోల్తా కొట్టింది. ఆయన తమ్ముడు చిన్నబ్బరెడ్డి, పద్మ అక్కడికక్కడే మృతిచెందారు. నెలలైనా నిండని మనవడు సైతం చనిపోవడంతో మృతుల సంఖ్యకు మూడుకు చేరింది.
News August 12, 2025
ద్రావిడ వర్సిటీ: ద.రాష్ట్రాల విద్యార్థుల కోసం దరఖాస్తులు

ద్రావిడ వర్సిటీలో 2025-26 సంవత్సరానికి సంబంధించి దక్షిణ రాష్ట్రాల విద్యార్థుల కోసం UG&PG కోర్సులలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రిజిస్ట్రార్ ఆచార్య కిరణ్ కుమార్ తెలిపారు. వారికి 10 శాతం రిజర్వేషన్ కలదన్నారు. ఆసక్తి, అర్హులైన విద్యార్థులు వర్సిటీలో ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
News August 12, 2025
గుడికి వెళుతూ.. ఇద్దరు స్పాట్ డెడ్

GD నెల్లూరు(M) పళ్లిపట్టు సమీపంలో కాసేపటి క్రితం రోడ్డు ప్రమాదం జరిగింది. YCP నాయకుడు సురేంద్ర రెడ్డి కుటుంబం తిరుత్తణిలోని సుబ్రహ్మణ్య స్వామికి కావడి మొక్కుబడుల కోసం కారులో బయలుదేరారు. వారి కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీ కొని బోల్తా కొట్టింది. ఈ ఘటనలో ఆయన తమ్ముడు చిన్నబ్బరెడ్డి, పద్మ అక్కడికక్కడే మృతి చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడగా ఆస్పత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.