News September 12, 2024
రేపే జొన్నవాడ ఆలయంలో టెండర్లు

నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ శ్రీమల్లికార్జున సమేత కామాక్షితాయి ఆలయంలో అక్టోబర్ మూడో తేదీ నుంచి 12వ తేదీ వరకు దేవీ శరన్నవరాత్రులు జరగనున్నాయి. ఈ సందర్భంగా అలంకరణ పనులకు శుక్రవారం ఉదయం 11 గంటలకు టెండర్లు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఈవో ఆర్వభూమి వెంకట శ్రీనివాస్ రెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు. ఆసక్తి ఉన్నవారు టెండర్లలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.
Similar News
News November 15, 2025
ప్రతి 20KM కు EVఛార్జింగ్ స్టేషన్ కోసం కసరత్తు

జిల్లాలో EV వాహనాల ఛార్జింగ్ స్టేషన్లు పెంచేందుకు కసరత్తు మొదలైంది. జాతీయ రహదారులపై ప్రతి 20KM కు ఒక ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ సూచనకు అనుగుణంగా అధికారులు చర్యలు ప్రారంభించారు. PMఈ-డ్రైవ్ పథకం కింద ఏర్పాటు చేసే ప్రైవేట్ ఛార్జింగ్ స్టేషన్లకు 80% రాయితీ లభిస్తుంది. పబ్లిక్, ప్రైవేట్ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు కోసం ఇప్పటికే 25 స్థలాలను గుర్తించినట్లు అధికారులు చెబుతున్నారు.
News November 15, 2025
చేజర్ల మండలంలో రోడ్డు ప్రమాదం

చేజర్ల మండలం ఏటూరు కండ్రిక వద్ద శుక్రవారం గేదెను బైకు ఢీకొట్టింది. నాగులవెల్లటూరు గ్రామానికి చెందిన ముప్పసాని బాబు పోస్టల్ శాఖలో పనిచేస్తున్నారు. పొదలకూరు నుంచి పని ముగించుకుని తన గ్రామానికి తిరిగి వస్తుండగా గేదెను ఢీకొనడంతో గాయపడ్డాడు. స్థానికులు 108 సాయంతో పొదలకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
News November 15, 2025
Way2News కథనం.. మంత్రి ఆదేశాలతో పనులు

నెల్లూరు నగరంలోని ఆత్మకూరు బస్టాండు అండర్ బ్రిడ్జి, ఫ్లైఓవర్‌పైన జాయింట్ల వద్ద రూ.40లక్షలతో మరమ్మతులు చేపడుతున్నట్లు కమిషనర్ నందన్ తెలిపారు. ఈ పనులు 16వ తేదీ నుంచి సుమారుగా 45 రోజులపాటు జరుగుతాయన్నారు. మంత్రి నారాయణ ఆదేశించినట్లు కమిషనర్ తెలిపారు. ఈ సమస్యపై ఇటీవల “మంత్రి వర్యా.. ఇదీ మీ సమస్య కాదా” అన్న శీర్షికన Way2News కథనం ప్రచురించింది. స్పందించిన మంత్రి మరమ్మతులకు ఆదేశించారు.


