News October 15, 2025
రేపే మలయాళ స్వామి విగ్రహ ఏర్పాటుకు శంకుస్థాపన

శ్రీవ్యాసాశ్రమ వ్యవస్థాపకులు మలయాళ స్వామి విగ్రహ ఏర్పాటుకు ఆశ్రమ పూర్వ విద్యార్థులు ముందుకొచ్చారు. ఏర్పేడులోని వెంకటగిరి బైపాస్ క్రాస్ వద్ద విగ్రహ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. గురువారం ఉదయం 7.30 గంటలకు శంకుస్థాపన చేయనున్నారు. శ్రీవాసాశ్రమ శతాబ్ది ఉత్సవాల సమయానికి విగ్రహాన్ని ఆవిష్కరించేలా పనులు పూర్తి చేస్తామని పూర్వ విద్యార్థుల సంఘ సభ్యులు తెలిపారు.
Similar News
News October 16, 2025
ఈనెల 18న ఉమ్మడి ప.గో జిల్లా స్థాయి ఎంపికల పోటీలు

స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని అన్ని స్కూల్ యాజమాన్యాల అండర్-14, 17 బాల, బాలికల జిల్లాస్థాయి ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి అలివేలుమంగ తెలిపారు. ఈనెల 18న స్కిటింగ్, జూడో పోటీలు ఏలూరులోని ఇండోర్ స్టేడియంలో, సాఫ్ట్ టెన్నిస్, స్క్వాష్ పోటీలను లింగపాలెం మండలం కలరాయన గూడెం జిల్లా పరిషత్ స్కూల్లో నిర్వహిస్తున్నామన్నారు.
News October 16, 2025
ADB: మేనేజ్మెంట్ కమిటీ సమావేశంలో పాల్గొన్న కలెక్టర్

ఆదిలాబాద్‌లోని కేంద్రీయ విద్యాలయంలో నిర్వహించిన విద్యాలయ మేనేజ్మెంట్ కమిటీ (VMC) సమావేశానికి జిల్లా కలెక్టర్ రాజర్షి షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యాలయ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై కమిటీ సభ్యులతో విస్తృతంగా చర్చించారు. పదవ తరగతి విద్యార్థులతో ప్రత్యక్షంగా మాట్లాడి వారి లక్ష్యాలు, సన్నద్ధత, ప్రోత్సాహక విషయాలపై పలు సూచనలు చేశారు.
News October 16, 2025
నిజామాబాద్: అభివృద్ధి పనులు గడువులోగా పూర్తి చేయాలి: కలెక్టర్

ప్రజలకు మెరుగైన సదుపాయాలు అందించేందుకు చేపట్టిన అభివృద్ధి పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం నిజామాబాద్‌లో కొనసాగుతున్న మాధవనగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులతో పాటు ఖలీల్‌వాడిలో నిర్మాణంలో ఉన్న వెజ్-నాన్‌వెజ్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డు తదితర పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నాణ్యత విషయంలో రాజీ పడరాదని సూచించారు.