News February 11, 2025
రేపే మేడారం జాతర!

మేడారం సమ్మక్క-సారలమ్మ మినీ జాతరకు ఒక్క రోజే మిగిలి ఉంది. రేపటి నుంచి 15 వరకు జాతర వైభవంగా జరగనుంది. ఇప్పటికే వేల సంఖ్యలో భక్తులు అమ్మవార్లకు ముందస్తు మొక్కులు చెల్లిస్తున్నారు. TG నుంచి మాత్రమే కాకుండా.. AP, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి సైతం భక్తులు ఇక్కడికి వస్తుండటం విశేషం. భక్తులకు ఇబ్బందులు లేకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మీరూ వనదేవతల జాతరకు వెళ్తున్నట్లైతే కామెంట్‌లో తెలపండి.
Similar News
News April 4, 2026
ఆదిలాబాద్ AIRPORT.. భూసేకరణపై చర్యలు..!

ఆదిలాబాద్‌లో AIRPORT నిర్మాణానికి భూసేకరణ చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకొంటోంది. ఆదిలాబాద్ అర్బన్, ఖానాపూర్, అనుకుంట, నిషాన్ ఘాట్ గ్రామాల్లో ఉన్న 430 ఎకరాల భూసేకరణకు కావాల్సిన గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు జీవోను అధికారి వికాస్ రాజ్ జారీ చేశారు. ADBలో భారత AIRFORCEకు చెందిన 369 ఎకరాల స్థలం ఉంది. విమానాశ్రయం కోసం అదనంగా భూసేకరణ అవసరమని AAI పేర్కొంది.
News April 4, 2026
ఉమ్మడి ఆదిలాబాద్‌కు వర్ష సూచన..?

రానున్న మూడు రోజుల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. పలు చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు పేర్కొంది. కాగా ఉమ్మడి జిల్లాలో ఎండలు దంచికొడుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలో రాష్ట్రంలోనే అత్యధికంగా 40.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత శుక్రవారం నమోదైందని వెల్లడించారు.
News April 4, 2026
నర్సంపేట కేంద్రంగా స్కానింగ్ దందా?

గర్భిణులకు పుట్టబోయేది పాప, బాబునా? అని చెప్పేందుకు నర్సంపేట అడ్డాగా మారినట్లు పోలీసులు గుర్తించారు. పున్నేలులో జరిగిన హత్యలకు కారణం కూడా అక్కడి వ్యక్తేనని తెలుస్తోంది. నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం జిల్లాల నుంచి పరీక్షల కోసం ఇక్కడికి వస్తున్నట్లు సమాచారం. లింగ నిర్ధారణ పరీక్షలు నిషేధమని తెలిసినా, వైద్యశాఖ అధికారులు మామూళ్ల మత్తులో జోగుతుండటంతో ఈ దందా సాగుతోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.


