News February 11, 2025
రేపే మేడారం జాతర!

మేడారం సమ్మక్క-సారలమ్మ మినీ జాతరకు ఒక్క రోజే మిగిలి ఉంది. రేపటి నుంచి 15 వరకు జాతర వైభవంగా జరగనుంది. ఇప్పటికే వేల సంఖ్యలో భక్తులు అమ్మవార్లకు ముందస్తు మొక్కులు చెల్లిస్తున్నారు. TG నుంచి మాత్రమే కాకుండా.. AP, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి సైతం భక్తులు ఇక్కడికి వస్తుండటం విశేషం. భక్తులకు ఇబ్బందులు లేకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మీరూ వనదేవతల జాతరకు వెళ్తున్నట్లైతే కామెంట్‌లో తెలపండి.
Similar News
News February 1, 2026
Apocalypto యాక్టర్ కన్నుమూత

ప్రముఖ మెక్సికన్ యాక్టర్ గెరార్డో తరసేనా(55) కన్నుమూశారు. ఆయన మరణానికి గల కారణాలు తెలియరాలేదు. Apocalypto, మ్యాన్ ఆన్ ఫైర్, ది మెక్సికన్ సినిమాలు, నార్కోస్ వెబ్ సిరీస్ ద్వారా ఆయన ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. కెరీర్‌లో దాదాపు 50 చిత్రాలు, టీవీ సిరీస్‌లలో నటించారు.
News February 1, 2026
అంబటిపై తిరుపతి SPకి ఫిర్యాదు

సీఎం చంద్రబాబుపై అసభ్య వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి అంబటి రాంబాబుపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని తుడా ఛైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆ మేరకు ఆదివారం SP సుబ్బారాయుడికు ఫిర్యాదు చేశారు. ఇలాంటి భాష ప్రజాస్వామ్యానికి అవమానకరమని ఆయన పేర్కొన్నారు.
News February 1, 2026
నిద్రలేమితో హెయిర్ ఫాల్

నిద్ర లేమి వల్ల శరీరంలో కార్టిసోల్ అనే ఒత్తిడి హార్మోన్ స్థాయి పెరుగుతుంది. ఈ హార్మోన్ స్థాయి పెరిగినప్పుడు.. అది నేరుగా జుట్టు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. అధిక కార్టిసోల్ జుట్టు కుదుళ్లకు రక్త ప్రసరణను తగ్గిస్తుంది. దీని కారణంగా.. కుదుళ్లకు సరైన పోషణ అందక జుట్టు రాలడం మొదలవుతుంది. అంతేకాకుండా అసంపూర్తి నిద్ర జుట్టును బలహీనపరచడమే కాకుండా.. తల చర్మాన్ని కూడా పాడు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.


