News February 11, 2025

రేపే మేడారం జాతర..!

image

మేడారం సమ్మక్క-సారలమ్మ మినీ జాతరకు ఒక్క రోజే మిగిలి ఉంది. రేపటి నుంచి 15 వరకు జాతర వైభవంగా జరగనుంది. ఇప్పటికే వేల సంఖ్యలో భక్తులు అమ్మవార్లకు ముందస్తు మొక్కులు చెల్లిస్తున్నారు. TG నుంచి మాత్రమే కాకుండా.. AP, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి సైతం భక్తులు ఇక్కడికి వస్తుండటం విశేషం. భక్తులకు ఇబ్బందులు లేకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మీరూ వనదేవతల జాతరకు వెళ్తున్నట్లైతే కామెంట్‌లో తెలపండి.

Similar News

News December 27, 2025

కామారెడ్డి జిల్లాలో నేటి ముఖ్య అంశాలు

image

* భిక్కనూర్: సోదరుడిని చంపిన తమ్ముడు
* కామారెడ్డి: విద్యార్థులతో చెస్ ఆడిన కలెక్టర్
* భిక్కనూర్: మోటాట్ పల్లిని సందర్శించిన ఏఎస్పీ
* కామారెడ్డి: కలెక్టరేట్‌ను ముట్టడించిన ఆశా కార్యకర్తలు
* బిచ్కుంద: క్రిస్టమస్ ముగింపు వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే
* మద్దెల చెరువులో గ్రామపంచాయతీ భవనం ప్రారంభం

News December 27, 2025

ఇరిగేషన్ శాఖ సలహాదారుపై BRS గురి!

image

TG: అసెంబ్లీలో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై చర్చకు ముందు ఇరిగేషన్ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్‌పై BRS గురిపెట్టింది. 2014-19 మధ్య CBN పాలనలో AP నీటిపారుదల శాఖ కార్యదర్శిగా ఉన్న ఆయన ఈ ప్రాజెక్టుపై ఫిర్యాదు చేసి పనులను నిలిపివేశారని BRS ఆరోపిస్తోంది. దీంతో కౌంటర్ ఇచ్చేందుకు CM రేవంత్, మంత్రి ఉత్తమ్ సిద్ధమవుతున్నారు. ప్రాజెక్టును నిలిపివేయడంలో ఆదిత్యనాథ్ పాత్రపై ఆరా తీస్తున్నట్లు సమాచారం.

News December 27, 2025

కరీంనగర్: పెండింగ్ బిల్లులు చెల్లించాలని ధర్నా

image

2022, 2023 సంవత్సరాలకు సంబంధించిన లెప్రసీ, పల్స్‌ పోలియో బిల్లులను చెల్లించాలని శనివారం కరీంనగర్‌ కలెక్టరేట్ ఎదుట సీఐటీయూ ఆశావర్కర్లు ధర్నా చేశారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు ఎడ్ల రమేశ్‌ మాట్లాడుతూ.. ఈ బిల్లులపై డీఎంహెచ్‌ఓ సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఆశావర్కర్లకు రూ.18 వేల వేతనం చెల్లించాలని, పీఎఫ్‌, ఈఎస్‌ఐ సౌకర్యం కల్పించే వరకు పోరాడుతామన్నారు.