News April 22, 2025
రేపే రిజల్ట్.. సత్యసాయి జిల్లా విద్యార్థుల ఎదురుచూపు

పదో తరగతి పరీక్షల ఫలితాల విడుదలకు సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం 10 గంటలకు మంత్రి నారా లోకేశ్ ఫలితాలను విడుదల చేయనున్నారు. శ్రీ సత్యసాయి జిల్లాలో 23,730 మంది విద్యార్థులు ఉన్నారు. మార్చి 17 నుంచి ఏప్రిల్ 1 వరకు పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే.
☞ వే2న్యూస్ యాప్‌లోనూ ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.
Similar News
News April 22, 2025
రాజన్న సిరిసిల్ల జిల్లాలో భానుడి భగభగ

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గడిచిన 24 గంటల్లో బాలుడు భగభగ మండుతున్నాడు. సిరిసిల్ల 43.5 °c, వీర్నపల్లి 43.4°c, వేములవాడ రూరల్ 43.3°c, బోయిన్పల్లి 43.2 °c, చందుర్తి 43.1 °c, రుద్రంగి 43.0°c, ఇల్లంతకుంట 43. 0°c, కోనరావుపేట 43. 0°c, ఎల్లారెడ్డిపేట 42.8 °c, గంభీరావుపేట 42.4 °c, తంగళ్ళపల్లి 41.7 °c లుగా నమోదు అయినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.
News April 22, 2025
ప్రకాశం: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

ఉమ్మడి ప్రకాశం జిల్లా బల్లికురవ మండలంలోని కొప్పెరపాడు వద్ద మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గుర్తుతెలియని వాహనం ఢీకొడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న బల్లికురవ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. స్థానికంగా బిక్షాటన చేస్తుంటుందని స్థానికులు పేర్కొన్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News April 22, 2025
NLG: 20 దేశాలకు మన తాటి ముంజలు!

వేసవి వచ్చిందంటే చాలు తాటి ముంజలకు గిరాకీ పెరుగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి పలువురు తాటి ముంజలను NLGకు తీసుకువచ్చి విక్రయిస్తున్నారు. డజన్ రూ.70 వరకు అమ్ముతున్నట్లు తెలిపారు. NLG జిల్లాకు చెందిన మువ్వ రమేశ్ అనే యువ పారిశ్రామికవేత్త వీటిని విదేశాలకు ఎగుమతి చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నాడు. గుడిమల్కాపూర్ ఇండస్ట్రియల్ పార్కులోని తేజస్ ఫుడ్ ఇండస్ట్రీస్ ద్వారా 20 దేశాలకు తాటి ముంజలు ఎగుమతి చేస్తున్నారు.