News December 19, 2025
రేపే T20 WC జట్టు ప్రకటన!

భారత T20 WC జట్టును శనివారం ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. కెప్టెన్‌గా సూర్య, వైస్ కెప్టెన్‌గా గిల్‌ను కొనసాగించనున్నారు. SA సిరీస్‌కు ఎంపిక చేసిన జట్టులో నుంచి ఒకరిద్దరిని తొలగించి వారి స్థానంలో ఇషాన్ కిషన్, పంత్, అయ్యర్, రింకూ, జురెల్‌కు చోటు కల్పించే అవకాశాలున్నట్లు క్రీడావర్గాలు తెలిపాయి. అయితే సూర్య, గిల్ ఫామ్ ఆందోళన కలిగించే అంశంగా పేర్కొన్నాయి. 2026 FEB 7- MAR 8 వరకు T20 WC జరగనుంది.
Similar News
News December 24, 2025
లైఫ్ అంటే పని మాత్రమే కాదు బాస్! ఈ దేశాలను చూడండి..

వర్క్ లైఫ్ బ్యాలెన్స్ విషయంలో కొన్ని దేశాలు మెరుగ్గా ఉన్నాయి. నెదర్లాండ్స్‌లో ఫ్లెక్సిబుల్ వర్క్ కల్చర్‌తో ఫ్యామిలీకి టైమ్ దొరుకుతుంది. డెన్మార్క్ తక్కువ పని గంటలు, ఎక్కువ సెలవులతో టాప్‌లో ఉంది. ఉద్యోగుల సంక్షేమం విషయంలో స్వీడన్, సండే రెస్ట్ ఇంపార్టెన్స్‌లో జర్మనీ, పనిదోపిడీని అరికట్టడంలో న్యూజిలాండ్ ముందు వరుసలో ఉన్నాయి. అందుకే ఆ దేశాల్లో ప్రొడక్టివిటీతో పాటు పర్సనల్ లైఫ్ మెరుగ్గా ఉంటుంది.
News December 24, 2025
BSNL ఆఫర్.. రూ.251కే 100GB

న్యూ ఇయర్ సందర్భంగా BSNL వరుస <<18637920>>ఆఫర్లతో<<>> హోరెత్తిస్తోంది. తాజాగా 30 రోజుల వ్యాలిడిటీతో రూ.251 ప్లాన్‌ను తీసుకొచ్చింది. దీంతో 100 GB డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్‌తోపాటు ఫ్రీగా BiTV(BSNL ఎంటర్‌టైన్‌మెంట్)ను వీక్షించవచ్చని తెలిపింది. ఈ ఆఫర్ JAN 31 వరకు ఉంటుందని పేర్కొంది. అయితే ఎన్ని ఆఫర్లు ఇచ్చినా నెట్‌వర్క్ ఉండట్లేదని కస్టమర్లు పేర్కొంటున్నారు. 4G, 5G నెట్‌వర్క్ బలోపేతంపై దృష్టిపెట్టాలని సూచిస్తున్నారు.
News December 24, 2025
సోయాబీన్, మొక్కజొన్న రైతులను కేంద్రం ఆదుకోవాలి

TG: వర్షాలతో నష్టపోయిన సోయాబీన్ రైతులను ఆదుకోవాలని కేంద్రమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌కు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లేఖ రాశారు. సోయా కోతదశలో వర్షాల వల్ల ADB, NRML, KMRD, SRD జిల్లాల్లో 36వేల టన్నుల పంట దెబ్బతిందని దీన్ని ధర మద్దతు పథకం(PSS) కింద కొనుగోలుకు అనుమతివ్వాలని కోరారు. మొక్కజొన్నను నాఫెడ్ ద్వారా కొనుగోలు చేసి ఇథనాల్, డిస్టిలరీ పరిశ్రమలకు సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.


