News November 8, 2025

రేవంత్, కేసీఆర్‌కు కిషన్ రెడ్డి సవాల్

image

TG: రాష్ట్రంలో <<18226951>>బ్యాడ్ బ్రదర్స్<<>> అంటే రేవంత్, KCR అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి తాను తీసుకొచ్చిన నిధులపై చర్చకు సిద్ధమా అని వారికి సవాల్ విసిరారు. కేంద్రం ఏం ఇచ్చిందో డాక్యుమెంట్లతో సహా వివరిస్తానని ప్రెస్‌మీట్‌లో పేర్కొన్నారు. ‘రేవంత్‌ది ఫెయిల్యూర్ ప్రభుత్వం. బ్యాడ్ బ్రదర్స్ అవినీతికి పాల్పడ్డారు. రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టారు’ అని వ్యాఖ్యానించారు.

Similar News

News November 8, 2025

వివేకా హత్య కేసు.. ఇద్దరు పోలీసులపై కేసులు నమోదు

image

AP: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఇద్దరు పోలీసు అధికారులపై కేసులు నమోదయ్యాయి. రాజుపాలెం పీఎస్ ఏఎస్సై రామకృష్ణారెడ్డి, రిటైర్డ్ ఏఎస్పీ రాజేశ్వర్ రెడ్డిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. వివేకా హత్య వ్యవహారంలో గతంలో వీరు తప్పుడు కేసులు నమోదు చేశారని పులివెందులకు చెందిన కుళాయప్ప అనే వ్యక్తి తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

News November 8, 2025

తాజా సినీ ముచ్చట్లు!

image

✏ హీరో రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా నుంచి రిలీజైన ‘చికిరి చికిరి’ లిరికల్ సాంగ్‌కు 24 గంటల్లో 46మిలియన్ల వ్యూస్ వచ్చాయి. IND సినిమాలో ఒక్కరోజులో అత్యధిక వీక్షణలు సాధించిన సాంగ్‌ ఇదే.
✏ మహేశ్- రాజమౌళి మూవీ మేకర్స్ ఈనెల 15న జరిగే ‘GlobeTrotter’ ఈవెంట్‌లో 100ft పొడవు & 130ft వెడల్పుతో భారీ స్క్రీన్ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. కనీవినీ ఎరుగని రీతిలో 3 ని.ల గ్లింప్స్ వీడియో ప్రదర్శిస్తారని టాక్.

News November 8, 2025

మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో మేనేజర్ పోస్టులు

image

మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో 17 కాంట్రాక్ట్ మేనేజర్ పోస్టుల భర్తీకి షార్ట్ నోటిఫికేషన్ విడుదలైంది. బీఈ, బీటెక్‌తో పాటు పని అనుభవం గల అభ్యర్థులు ఈ నెల 28 వరకు అప్లై చేసుకోవచ్చు. సీనియర్ మేనేజర్లకు నెలకు రూ.70వేలు, జూనియర్ మేనేజర్‌లకు రూ.30వేల జీతం చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://ddpdoo.gov.in/