News February 10, 2026
రేవంత్ మతం మార్చుకున్నా అభ్యంతరం లేదు: కిషన్ రెడ్డి

TG: ‘కిషన్ రావు’ అంటూ CM రేవంత్ చేసిన <<19085836>>విమర్శలకు<<>> కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కౌంటరిచ్చారు. ‘నా పేరును మార్చే అధికారం మీకు లేదు. రేవంత్ ఖాన్ అని మీరు గర్వంగా చెప్పుకున్నారు. మీరు పేరు, మతం మార్చుకున్నా మాకు అభ్యంతరం లేదు. మజ్లిస్‌తో మీరు కాపురం చేసినన్ని రోజులు మేం నిప్పులు పోస్తాం. KCRకి నేను దత్తపుత్రుడినని విమర్శించారు. నేనెవరికీ దత్తపుత్రుడిని కాదు’ అని ఢిల్లీ ప్రెస్‌మీట్‌లో మండిపడ్డారు.
Similar News
News February 21, 2026
గొర్రెల పెంపకం – పాక్షిక సాంద్ర పద్ధతి

పాక్షిక సాంద్ర పద్ధతిలో గొర్రెలను కొద్ది గంటల పాటు పచ్చిక బయళ్లలో మేపి మిగతా సమయం అంతా ఇంటివద్ద పాకలలో ఉంచి పెంచుతారు. అంతేకాక పాకలలో వాటికి పచ్చిగడ్డి, దాణా, త్రాగటానికి నీరు మొదలగునవి పెడతారు. ఈ పద్ధతిలో ఎంపిక చేసిన పొట్టేళ్లతోనే ఆడ గొర్రెలను జతకలపవచ్చు. బయట వృథాగా ఉన్న పచ్చిక బయళ్లను సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చు. కొన్ని గ్రామాల్లో ఈ పద్ధతిని అనుసరిస్తున్నారు.
News February 21, 2026
‘వైఖానస ఆగమం’ అనుసరించే శ్రీవారి పూజలు

విఖనస మహర్షి రచించిన ‘వైఖానస ఆగమం’ శ్రీవారి ఆలయ పూజా విధానాలకు మూలస్తంభం. ఇది దేవాలయ, గృహ పూజా శాస్త్రాన్ని సమగ్రంగా వివరిస్తుంది. ఈ ఆగమం ప్రకారం తిరుమలలో పూజలు జరుగుతాయి. వీటివల్ల లోకకళ్యాణం, సస్యశ్యామలం సిద్ధిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. TTD శతాబ్దాలుగా ఈ ఆగమ సూత్రాలను పాటిస్తూ శ్రీవారి కైంకర్యాలు నిర్వహిస్తోంది. భక్తులను ఆర్జిత సేవల్లో భాగస్వాములను చేస్తూ ఇందులోని నియమాలు కొనసాగిస్తున్నారు.
News February 21, 2026
వెయ్యేళ్ల నాటి సమాధిలో బంగారం, పెయింటింగ్స్

పనామాలోని ఎల్ కానో సైట్‌లో వెయ్యేళ్లకు పైబడిన పురాతన సమాధిని పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. సుమారు 800-1000AD మధ్య దీన్ని నిర్మించినట్లు లీడ్ రీసెర్చర్ వెల్లడించారు. అక్కడ మానవ అవశేషాలు, సిరామిక్ కళాఖండాలతోపాటు బంగారం కూడా ఉందని తెలిపారు. ‘మృతదేహానికి రెండు కంకణాలు, చెవి పోగులు, ఛాతీ ఆభరణాలు ఉన్నాయి. ఆ కాలంలో ఇతను సమాజంలో ఉన్నతస్థాయి వ్యక్తి అయి ఉండొచ్చు’ అని పేర్కొన్నారు.


