News January 3, 2025
రేవంత్ రెడ్డి పాన్ ఇండియా CM: చామల
రేవంత్ రెడ్డి పాన్ ఇండియా సీఎం అయ్యారని MP చామల కిరణ్ కుమార్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. గాంధీభవన్‌లో మీడియాతో చిట్ చాట్‌లో మాట్లాడారు. కొంతమంది సీఎంలు అవినీతి చేసి అందరికీ తెలిశారన్నారు. కానీ, సీఎం రేవంత్ రెడ్డి సాహసోపేత నిర్ణయాలు తీసుకొని ఫేమస్ అయ్యారని వెల్లడించారు. రీజినల్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ మార్చి రైతులను బీఆర్ఎస్ మోసం చేసేందుకు ప్లాన్ చేసిందని చామల ఆరోపించారు.
Similar News
News January 5, 2025
HYD: హైడ్రాకు ఫిర్యాదు చేయాలా.. కాల్ చేయండి
ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. రాణిగంజ్‌లోని బుద్ధ భవన్‌లో ఉన్న హైడ్రా కార్యాలయంలో నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఉదయం 11 గం. నుంచి మధ్యాహ్నం 2 గం. వరకు.. మధ్యాహ్నం 3 గం. నుంచి సాయంత్రం 5:30 గం. వరకు నేరుగా లేదా, 040-29565758, 29560596 నంబర్‌కు ఫిర్యాదు చేయాలన్నారు.
News January 5, 2025
HYDలో IT శిక్షణకు అడ్డాగా అమీర్‌పేట
హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డిలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) సంబంధిత కోర్సుల శిక్షణకు అమీర్‌పేట అడ్డాగా మారింది. 1992 నుంచి ఇక్కడ ఐటీ శిక్షణ కొనసాగుతోంది. పైథాన్, డాట్ నెట్, డిజిటల్ మార్కెటింగ్, జావా, సీ ప్లస్, వీడియో ఎడిటింగ్, గ్రాఫిక్ డిజైన్ వంటి విభిన్న కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నారు. ఇక్కడ ట్రైనింగ్ కంప్లీట్ చేసిన ఎంతో మంది ఐటీ కొలువుల్లో రాణిస్తున్నారు. దీనిపై మీ కామెంట్?
News January 4, 2025
HYD: మంత్రులను, డీజీపీని కలిసిన హైడ్రా కమిషనర్
HYDలో మంత్రులు శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, డీజీపీ జితేందర్‌ను హైడ్రా కమిషనర్ రంగనాథ్ కలిశారు. వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం హైడ్రా తీసుకోబోయే చర్యలపై విస్తృతంగా చర్చలు జరిపినట్లు పేర్కొన్నారు. చట్టపరంగానే చెరువులు, ప్రభుత్వ భూములకు రక్షణ కల్పిస్తామన్నారు.