News October 29, 2025
రేవల్లిలో అత్యధిక వర్షపాతం నమోదైన

రెండు రోజులకు కురుస్తున్న వర్షాలకు వనపర్తి జిల్లా రేవల్లి మండలంలో 123.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. గోపాల్పేట్ 94.6, ఘనపూర్ 73.4, వనపర్తి 68.0, వీపనగండ్ల 63.2, చిన్నంబావి 58.4, పెద్దమందడి 51.8, పానగల్ 46.8, శ్రీరంగాపూర్ 40.4 , పెబ్బేరు 39.0, కొత్తకోట 33.4, మదనాపూర్ 32.2, ఆత్మకూరు 18.4, అమరచింతలో 12.4 వర్షపాతం నమోదైనట్లు తెలిపారు.
Similar News
News October 29, 2025
ఓదెల మండలంలో అధిక వర్షపాతం

పెద్దపల్లి జిల్లాలో మొంథా తుపాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పెద్దపల్లి జిల్లాలోని ఓదెల మండలంలో అత్యధికంగా 70.5మి.మీ. వర్షపాతం నమోదయింది. భారీ వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. అధికారులు లోతట్టు ప్రాంతాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. పాలకుర్తి, రామగుండం, అంతర్గాం మండలాల్లో స్వల్ప వర్షపాతం నమోదయింది.
News October 29, 2025
భరత్ పోరాటం వృథా.. ఓడిన తెలుగు టైటాన్స్

PKL సీజన్-12లో పుణేరి పల్టాన్‌తో జరిగిన క్వాలిఫయర్-2 మ్యాచులో తెలుగు టైటాన్స్ 45-50 పాయింట్ల తేడాతో ఓటమి పాలైంది. ఫస్టాఫ్‌లో టైటాన్స్ ఆధిక్యంలో నిలిచినా సెకండాఫ్‌లో పుణేరి పుంజుకుంది. భరత్ 23 పాయింట్లతో ఒంటరి పోరాటం చేసినా TT డిఫెండర్లు ప్రత్యర్థి ఆటగాళ్లను నిలువరించలేకపోయారు. ఓటమితో తెలుగు టైటాన్స్ ఇంటి దారి పట్టగా పుణే ఫైనల్ చేరింది. ఎల్లుండి దబాంగ్ ఢిల్లీతో అమీతుమీ తేల్చుకోనుంది.
News October 29, 2025
NGKL: డిండి మైనర్ బ్రిడ్జిని పరిశీలించిన జిల్లా ఎస్పీ

జిల్లాలోని డిండి ప్రాజెక్టు దిగువ భాగంలో ఉన్న మైనర్ బ్రిడ్జ్ ప్రమాదకరంగా మారడంతో ఈ విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ బుధవారం సాయంత్రం పరిశీలించారు. పరిశీలించిన అనంతరం స్థానిక పోలీసులతో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. బ్రిడ్జిపై రాకపోకలను పూర్తిగా నిషేధించినట్లు తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.


