News October 6, 2025

రేవల్లిలో కలకలం.. అత్తను చంపిన కోడలు

image

వనపర్తి జిల్లా రేవల్లి మండలం నాగపూర్ గ్రామంలో అమానుషం జరిగింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో కోడలు బోగురమ్మ తన వృద్ధురాలైన అత్త దొడ్డిపట్ల ఎల్లమ్మ (70)ను కొట్టి చంపింది. అనంతరం దీన్ని సాధారణ మృతిగా చిత్రీకరించడానికి ప్రయత్నించింది. ఆదివారం దహన సంస్కారాలు చేస్తుండగా మృతదేహం వద్ద దుర్వాసన రావడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చిందని ఎస్ఐ రజిత తెలిపారు. ఈ ఘటనతో గ్రామంలో కలకలం రేగింది.

Similar News

News October 6, 2025

ఈ నెల 10న క్యాబినెట్ భేటీ

image

AP: వారం వ్యవధిలోనే మంత్రి వర్గం <<17905338>>మరోసారి<<>> సమావేశం కానుంది. ఈ నెల 10న సీఎం చంద్రబాబు అధ్యక్షతన భేటీ జరగనుంది. పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపే అవకాశముంది.

News October 6, 2025

సమస్యల పరిష్కారంలో జాప్యం వద్దు: కలెక్టర్

image

PGRSకు వచ్చే అర్జీదారుల సమస్యలను సరైన ఎండార్స్‌మెంట్‌తో ముగించాలని జిల్లా కలెక్టర్ మహేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రజల నుంచి సుమారు 150 వినతిపత్రాలను స్వీకరించారు. కొన్ని అర్జీలు పునరావృతమవుతున్నాయని, ఇలా జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. సమస్యల పరిష్కారంపై నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ అధికారులను హెచ్చరించారు.

News October 6, 2025

HYD: మల్లేశ్‌కు ఉద్యోగం కల్పించిన NIMS డైరెక్టర్

image

ఎత్తు తక్కువ కారణంగా ఎక్కడా ఉద్యోగం దొరకక ఇబ్బంది పడుతున్న శంషాబాద్‌ వాసి మరుగుజ్జు మల్లేశ్‌కు NIMS డైరెక్టర్ ప్రొ.నగరి బీరప్ప అండగా నిలిచారు. తన బాధ విన్న ఆయన, మల్లేశ్‌కు ఉద్యోగం కల్పిస్తానని హామీ ఇచ్చి వెంటనే లిఫ్ట్ ఆపరేటర్‌గా నియామకపత్రం అందజేశారు. దీంతో మల్లేశ్ ఆనందం వ్యక్తం చేస్తూ, తన జీవితానికి కొత్త ఆశ కలిగించిన బీరప్పకి కృతజ్ఞతలు తెలిపాడు.