News April 5, 2026

రేవల్లి: 9న గొల్లపల్లి- చీర్కపల్లికి హరీష్ రావు రాక

image

రేవల్లి మండలంలోని గొల్లపల్లి- చిర్కపల్లి రిజర్వాయర్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 9వ తేదీన ధర్నా నిర్వహిస్తున్నట్లు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. రిజర్వాయర్‌కు వ్యతిరేకంగా అఖిలపక్ష పోరాట సమితి దీక్షలకు సంఘీభావం తెలపడానికి మాజీ మంత్రి హరీశ్ రావు రానున్నారని చెప్పారు. ప్రజాధనాన్ని లూటీ చేయడానికి ప్రభుత్వం ఈ రిజర్వాయర్ నిర్మాణం చేపడుతుందని బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు.

Similar News

News April 8, 2026

ఇంటర్ రిజల్ట్స్ వార్తలు ఫేక్.. నమ్మొద్దన్న బోర్డు!

image

AP: ఇంటర్ ఫలితాలపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని బోర్డు ఖండించింది. ఏప్రిల్ 12న రిజల్ట్స్ విడుదలవుతాయనే వార్తలు పూర్తిగా అబద్ధమని బోర్డు కమిషనర్ రంజిత్ బాషా స్పష్టం చేశారు. ఫలితాల తేదీపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, విద్యార్థులు ఇలాంటి ఫేక్ ప్రచారాలను నమ్మి ఆందోళన చెందవద్దని సూచించారు. రిజల్ట్స్ తేదీని అధికారికంగా అనౌన్స్ చేస్తామని చెప్పారు.

News April 8, 2026

వైభవ్‌ను ఇక వెయిట్ చేయించొద్దు: ఇర్ఫాన్

image

రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీపై ఇర్ఫాన్ పఠాన్ ప్రశంసల వర్షం కురిపించారు. బుమ్రా వంటి దిగ్గజ బౌలర్‌ను ఫోర్లు, సిక్సర్లతో టెన్షన్ పెట్టడం ఈజీ కాదని కొనియాడారు. ‘వైభవ్‌ను ఇక వెయిట్ చేయించకుండా వెంటనే టీమ్ ఇండియాలోకి తీసుకోండి’ అని BCCI సెలక్టర్లను కోరారు. బుమ్రానే ఆలోచనలో పడేసిన ఈ కుర్రాడు మరో 20 ఏళ్ల పాటు ప్రొఫెషనల్ క్రికెట్ ఆడగలడని, ఇది బౌలర్లకు హెచ్చరిక అని వ్యాఖ్యానించారు.

News April 8, 2026

‘రాకా’లో హీరో, విలన్‌గా అల్లు అర్జున్?

image

అట్లీ తీస్తున్న ‘రాకా’ సినిమాలోని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లుక్ విస్మయానికి గురిచేస్తోంది. మీడియా కూడా ఈ మూవీ టైటిల్‌, బన్ని పాత్రను పసిగట్టలేనంతలా మేకర్స్ గోప్యతను పాటించారు. అయితే ఈ యానిమల్ లుక్.. విలన్ పాత్రదని సినీవర్గాలు తెలిపాయి. హీరో, విలన్‌ పాత్రల్లో అల్లు అర్జున్ నటిస్తున్నట్లు వెల్లడించాయి. దీంతో విలన్ లుక్ అదిరిపోయిందని, హీరో లుక్ కోసం వెయిటింగ్ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.