News January 20, 2025

రేషన్‌కార్డుల జారీ నిరంతర ప్రక్రియ:  ADB కలెక్టర్

image

రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల ఫీల్డ్ వెరిఫికేషన్, గ్రామ సభలపై ఆదివారం సంబంధిత అధికారులతో కలెక్టర్ రాజర్షిషా గూగుల్ మీట్ నిర్వహించారు. ఈ నెల 21 నుంచి 24 వరకు నిర్వహించే గ్రామసభలకు విస్తృత ఏర్పాట్లు చేయాలన్నారు. గతంలో నిర్వహించిన ప్రజాపాలన గ్రామసభల మాదిరిగానే 21 నుంచి చేపట్టే గ్రామ సభలను నిర్వహించాలని అన్నారు.  రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అన్నారు.

Similar News

News February 24, 2026

ఆదిలాబాద్: రూ.1,000 కోట్లు ఎక్కడివి: కేటీఆర్

image

గాంధీ కుటుంబానికి రూ.1,000 కోట్లు ఇవ్వడానికి సిద్ధమని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజల డబ్బులు తన అయ్యా సొమ్మా అని కేటీఆర్ ఘాటుగా వ్యాఖ్యానించారు. జిల్లా జైల్లో ఉన్న బాల్క సుమన్‌తో ములాఖత్ అయిన తర్వాత మీడియాతో మాట్లాడారు. రైతులకు రైతు బంధు కోసం డబ్బులు లేవు గానీ, గాంధీ కుటుంబానికి రూ.1,000 కోట్లు ఇచ్చేందుకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. కేంద్ర సంస్థలు ఏమి చేస్తున్నాయన్నారు.

News February 24, 2026

ఆదిలాబాద్: సుమన్‌కు జైలు కొత్త కాదు: కేటీఆర్

image

మాజీ ఎంపీ, బాల్క సుమన్‌కు జైలులో ఉండటం కొత్తేమీ కాదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఆదిలాబాద్ జైలులో ఉన్న బాల్క సుమన్‌తో ములాఖత్ అయ్యాక కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. గతంలో తెలంగాణ ఉద్యమం సమయంలో సుమన్ ఎన్నో సార్లు జైలుకు వెళ్లి వచ్చారన్నారు. జైలులో పెడితే సుమన్ భయపడతారని కాంగ్రెస్ ప్రభుత్వం అనుకుంటే పొరపాటేనన్నారు.

News February 24, 2026

నేడు ఆదిలాబాద్‌కు కేటీఆర్

image

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు ఆదిలాబాద్ జిల్లాకు రానున్నట్లు మాజీ మంత్రి జోగు రామన్న తెలిపారు. ఇటీవల అరెస్టై ఆదిలాబాద్ జిల్లా జైలులో ఉన్న మంచిర్యాల జిల్లా పార్టీ అధ్యక్షుడు బాల్క సుమన్‌ను 11 గంటలకు ఆయన పరామర్శించనున్నారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలిరావాలని జోగు రామన్న పిలుపునిచ్చారు.