News July 8, 2025
‘రేషన్ కార్డుదారులు ఈ కేవైసీ చేయించుకోవాలి’

ఖమ్మం: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలనుసారం రేషన్ కార్డుదారులందరు ఆయా రేషన్ షాపులలో ఈ-కేవైసీ చేయించుకోవాలని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి చందన్ కుమార్ తెలిపారు. జిల్లాలోని 4,15,905 రేషన్ కార్డులకుగాను 12,03,943 మంది ఉన్నారు. ఇందులో 9,64,236 మంది మాత్రమే ఈ-కేవైసీ చేయించుకున్నారని చెప్పారు. మిగిలిన వారందరూ వెంటనే సమీపంలోని రేషన్ దుకాణాల్లో ఈ-కేవైసీ చేయించాలని సూచించారు.
Similar News
News September 17, 2025
నిరంతర విద్యుత్ సరఫరాకు కృషి చేయాలి: Dy.CM

ఖమ్మం జిల్లా ప్రజలకు నిరంతర విద్యుత్ సరఫరా అందించడానికి ఉద్యోగులందరూ కృషి చేయాలని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం పరేడ్ గ్రౌండ్‌లో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్‌ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా విద్యుత్ అధికారులతో మాట్లాడిన ఆయన, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్ఈ శ్రీనివాసచారి, తదితరులు పాల్గొన్నారు.
News September 17, 2025
పేదల సంక్షేమమే ప్రజాపాలన ధ్యేయం: Dy.CM భట్టి

ఖమ్మం: రాష్ట్రంలో పేదల సంక్షేమం, అభివృద్ధిని లక్ష్యంగా చేసుకుని ప్రజాపాలన కొనసాగుతోందని Dy.CM భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన జాతీయ జెండా ఆవిష్కరించి, ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. రైతాంగం, కూలీలు భూమి, భుక్తి కోసం చేసిన పోరాటాలు అమోఘమైనవని కొనియాడారు.
News September 17, 2025
ఖమ్మం: నిజాంకు వ్యతిరేకంగా తనికెళ్ల వీరుల పోరాటం

నిజాం పాలనకు వ్యతిరేకంగా తనికెళ్ల గ్రామ ప్రజలు సాగించిన పోరాటం అత్యంత కీలకమని నిజాం వ్యతిరేక పోరాట యోధులు గుర్తుచేశారు. కొణిజర్లకు చెందిన దొండపాటి వెంకయ్య, షేక్ మహబూబ్ అలీతో పాటు తనికెళ్లకు చెందిన గడల సీతారామయ్య, రామకృష్ణయ్య, ముత్తయ్య, యాస వెంకట లాలయ్య, మల్లెల వెంకటేశ్వరరావు దళంలో చేరి పోరాడారు. ఈ క్రమంలో రజాకారుల నుంచి సీతారామయ్యను గ్రామస్థులు తెలివిగా తప్పించిన వైనం స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.